Ram Mandir: అయోధ్య రామమందిరం పైకప్పు లీకేజీ!

అయోధ్య రామమందిరం గర్భగుడిలోకి పైకప్పు నుంచి నీరు కారుతున్నట్టు.. ఆలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్‌ సోమవారం తెలిపారు.

Updated : 25 Jun 2024 06:14 IST

గర్భగుడిలోకి వర్షపు నీరు

అయోధ్య: అయోధ్య రామమందిరం గర్భగుడిలోకి పైకప్పు నుంచి నీరు కారుతున్నట్టు.. ఆలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్‌ సోమవారం తెలిపారు. ఆలయాన్ని ప్రారంభించిన తర్వాత మొదటిసారి శనివారం రాత్రి భారీ వర్షం పడటంతో లీకేజీ సమస్య బయటపడిందని, నీరు సరిగ్గా రామ్‌లల్లా విగ్రహానికి ఎదురుగా పూజారి కూర్చునే, వీఐపీలు దర్శనం చేసుకునే చోట కారుతోందని దాస్‌ పేర్కొన్నారు. ఆలయ నిర్మాణంలో నిర్లక్ష్యంగా వ్యవహారించారని, ఆలయ ప్రాంగణం నుంచి వర్షపు నీరు పోయేందుకూ సరైన ఏర్పాట్లు లేవని.. ఈ సమస్యపై ఆలయ అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. పైకప్పు లీకేజీ సమాచారం అందుకున్న ఆలయ నిర్మాణ కమిటీ ఛైర్మన్‌ నృపేంద్ర మిశ్ర.. ఆలయానికి చేరుకుని పైకప్పుని వాటర్‌ప్రూఫ్‌గా మార్చేలా మరమ్మతు పనులు చేయాలని సూచించినట్లు ఆలయ వర్గాలు తెలిపాయి. మొదటి అంతస్తు పనులు జులై చివరకి, మొత్తం ఆలయ నిర్మాణం డిసెంబరు నాటికి పూర్తవుతుందని మిశ్ర విలేకరులకు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని