Prajwal Revanna: ప్రజ్వల్‌కు దక్కని ఊరట..బెయిల్‌ పిటిషన్‌ తిరస్కరణ

లైంగిక దౌర్జన్యం కేసులో హాసన మాజీ ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణకు ఊరట దక్కలేదు.

Published : 26 Jun 2024 18:57 IST

బెంగళూరు: పలువురు మహిళలపై లైంగిక దౌర్జన్యానికి పాల్పడినట్లు వచ్చిన ఆరోపణల్లో అరెస్టయిన హాసన మాజీ ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ (Prajwal Revanna)కు మరో ఎదురుదెబ్బ తగిలింది. బెంగుళూరులోని కోర్టు బుధవారం అతడి బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది. ప్రజ్వల్‌, అతడి తండ్రి హెచ్‌డీ రేవణ్ణలపై ప్రత్యేక కోర్టు బుధవారం విచారణ జరిపింది.

మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు అయిన ప్రజ్వల్‌ రేవణ్ణ.. ఎన్డీయే కూటమి తరఫున హాసన నుంచి ఎంపీగా బరిలోకి దిగారు. పలువురు మహిళలపై ఆయన లైంగిక దాడి చేసినట్లు వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టడంతో ఆయన గత ఏప్రిల్‌లో దేశం విడిచి పరారయ్యారు. అనంతరం దేశానికి వచ్చిన ఆయనను పోలీసులు అరెస్ట్‌ చేశారు. 

హాసన మాజీ ఎంపీ ప్రజ్వల్‌ను జనతాదళ్ సెక్యులర్ పార్టీ సస్పెండ్ చేసింది. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ప్రజ్వల్‌ 40,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ప్రస్తుతం అతడు ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) కస్టడీలో ఉన్నాడు.

తాజాగా ఒక యువకుడిపై (25) లైంగిక దౌర్జన్యానికి పాల్పడిన ఆరోపణలపై ప్రజ్వల్‌ రేవణ్ణ సోదరుడు, ఎమ్మెల్సీ డాక్టర్‌ సూరజ్‌ రేవణ్ణను పోలీసులు అరెస్టు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని