Published : 16/01/2022 03:26 IST

Omicron effect: ఆ 5 రాష్ట్రాల్లో ర్యాలీలు, రోడ్‌షోలపైనిషేధం పొడిగింపు

దిల్లీ: దేశవ్యాప్తంగా కొవిడ్ ఉద్ధృతి కొనసాగుతున్న వేళ కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లో రోడ్‌షోలు, పాదయాత్రలు, సైకిల్‌/బైక్‌ ర్యాలీలపై ఇదివరకే విధించిన నిషేధాన్ని పొడిగిస్తున్నట్టు వెల్లడించింది. ఈ నెల 8న ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్‌ని ప్రకటించిన సందర్భంగా ఎన్నికల ర్యాలీలపై విధించిన నిషేధం నేటితో ముగియనుండటంతో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు ఈరోజు వరుస సమావేశాలు నిర్వహించారు. ఉదయం 11గంటలకు  కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శితో పాటు ఎన్నికల రాష్ట్రాల సీఎస్‌లు, ఆరోగ్యశాఖ కార్యదర్శులతో; అలాగే, మధ్యాహ్నం 1గంటకు ఎన్నికల ప్రధాన అధికారులతో సమావేశమయ్యారు. ఆయా రాష్ట్రాల్లో కరోనా, ఒమిక్రాన్‌ కేసుల పరిస్థితులపై చర్చించినట్టు సమాచారం. కొవిడ్‌ మహమ్మారి ఉద్ధృతి దృష్ట్యా కొన్నాళ్ల పాటు నిషేధం ఉంచడమే మేలనే అభిప్రాయాలు వ్యక్తం కావడంతో ఎన్నికల సంఘం ఎన్నికల ర్యాలీలపై తాత్కాలిక నిషేధాన్ని ఈ నెల 22వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇండోర్‌లలో నిర్వహించే సమావేశాలకు 300 మంది/ హాలులో 50శాతం సామర్థ్యానికి మించకుండా చూసుకోవాలని రాజకీయ పార్టీలకు సూచించింది. 

ఆయా రాష్ట్రాల్లో యాక్టివ్‌ కేసులు ఇలా..

మరోవైపు, ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో కొవిడ్‌ కేసులు తగ్గినట్టే తగ్గే మళ్లీ పెరుగుతున్నాయి. ఒమిక్రాన్‌ ప్రభావంతో భారీగా కేసులు వస్తున్నాయి. దీంతో యాక్టివ్‌ కేసుల సంఖ్య పెరుగుతోంది. యూపీలో ప్రస్తుతం 84,440 క్రియాశీల కేసులు ఉండగా.. ఉత్తరాఖండ్‌లో 12,349, పంజాబ్‌లో 34,303, గోవాలో 18,597, మణిపూర్‌లో 944 చొప్పున కొవిడ్‌ రోగులు ఉన్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, పంజాబ్‌, గోవా, మణిపుర్‌లలో మొత్తం 690 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. అన్ని రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపును మార్చి 10న ఒకేసారి చేపడతారు.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని