26 సెకన్లలో బాపు బొమ్మ..

బోసి నవ్వుల గాంధీ తాత బొమ్మ వేయమంటే.. చిత్రకారులే తడబడతారు.

Published : 20 Feb 2021 12:20 IST

బెంగళూరు: బోసి నవ్వుల గాంధీ తాత బొమ్మ వేయమంటే.. చిత్రకారులే తడబడతారు. కానీ కర్ణాటకలోని విజయపురకు చెందిన ఓ బుడతడు మాత్రం.. కేవలం 26 సెకన్లలో మహాత్ముని బొమ్మ వేసి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. అయిదో తరగతి చదువుతున్న ఆ బాలుడి పేరు  రేవణ్న. తనకున్న ప్రత్యేకతతో ఇప్పటికే అనేక అవార్డులు గెలుచుకోవడమే కాక, అందరితో భళా అనిపించుకుంటున్నాడు. అత్యుత్తమ పెయింటింగ్‌కు ఇచ్చే.. రవివర్మ అవార్డు, కర్ణాటక ప్రోగ్రెసివ్‌ పెయింటింగ్‌ పురస్కారాలూ అందుకున్నాడు. తల్లిదండ్రుల ప్రోత్సాహం, నిరంతర సాధనతోనే తనకీ రికార్డులు సొంతం అయ్యాయని చెప్తున్నాడు రేవణ్న. ఆన్‌లైన్‌ వేదికగా నిర్వహించే పోటీల్లో ఎన్నో బహుమతులు గెలుచుకున్నట్లు పేర్కొన్నాడు. అంతేగాక నాణేల సేకరణ, యోగా వంటి వాటిల్లో ప్రవేశం ఉందని తెలిపాడు. పేద ప్రజలకు ఉచితంగా యోగా, చిత్రలేఖనం నేర్పించి తన వంతుగా సాయపడతానని రేవణ్న తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని