
Karnataka: ఆయన ఎన్నికైన సీఎం కాదు.. డబ్బు ఇచ్చి ముఖ్యమంత్రి అయ్యారు..!
బసవరాజు బొమ్మైపై కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య ఆరోపణ
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి పదవీ వ్యవహారం దేశ రాజకీయాల్లో మరో చర్చనీయాంశంగా మారుతోంది. రూ.2500కోట్లు ఇస్తే తనకు ముఖ్యమంత్రి పదవి ఇస్తానన్నారంటూ కేంద్ర మాజీ మంత్రి, భాజపా ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి. ఈ క్రమంలో బసవరాజు బొమ్మై ఎన్నికైన ముఖ్యమంత్రి కాదని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నారు. నగదు మార్పిడితోనే బొమ్మై ఆ పదవిలో నియమితులయ్యారని ఆరోపించారు.
‘బసవరాజు బొమ్మై ఎన్నికైన ముఖ్యమంత్రి కాదు, నియమించిన సీఎం. అందుకే ఆయన ఏమీ చేయడం లేదు. డబ్బు ఇచ్చి ముఖ్యమంత్రి అయ్యారు, ఇంకా పనులు ఎందుకు చేస్తారు..? ఆర్ఎస్ఎస్ ఆయనను ముఖ్యమంత్రి చేసింది. వారి సూచనలు పాటించడమే ఆయన విధి’ అని కాంగ్రెస్ సీనియర్ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆరోపించారు. గడిచిన నాలుగేళ్లలో పేద ప్రజలకు ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయలేదని.. అటువంటి ప్రభుత్వం అవసరమా అని ప్రశ్నించారు. తాను సీఎంగా ఉన్న సమయంలో రాష్ట్రంలో 15లక్షల ఇళ్లు నిర్మించామని.. గత ఐదేళ్లుగా అధికారంలో ఉన్న భాజపా ఈ విషయంలో సిగ్గుపడాలని అన్నారు.
ఇదిలాఉంటే, రూ. 2500 కోట్లు ఇస్తే ముఖ్యమంత్రి పదవి వరిస్తుందని చెబుతూ కొందరు తనని సంప్రదించారని భాజపా ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నల్ చేసిన వ్యాఖ్యలు కర్ణాటక రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. అయితే, ఎవరు సంప్రదించారనే విషయాన్ని ఆయన వెల్లడించనప్పటికీ.. అటువంటి మోసపూరిత కంపెనీలు ఉన్నాయని ఆ పార్టీ కార్యకర్తలకు చెప్పుకొచ్చారు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ భాజపాపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ వ్యవహారంలో పూర్తి దర్యాప్తు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Related-stories News
Crime News: గుడిలో నాలుక కోసేసుకున్న భక్తురాలు
-
Related-stories News
Mouse Deer: మూషిక జింక.. బతికేందుకు తంటా
-
Ts-top-news News
Drones: మనుషుల్ని మోసుకెళ్లే డ్రోన్లు.. గమ్యానికి తీసుకెళ్లే సైకిళ్లు!
-
General News
ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (25-06-2022)
-
World News
Antonio Guterres: ఆహార కొరత.. ప్రపంచానికి మహా విపత్తే : ఐరాస చీఫ్ హెచ్చరిక
-
India News
50 States: ఎన్నికల తర్వాత దేశంలో 50 రాష్ట్రాలు.. కర్ణాటక మంత్రి సంచలన వ్యాఖ్యలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (25-06-2022)
- Google Play Store: ఫోన్లో ఈ ఐదు యాప్స్ ఉన్నాయా? వెంటనే డిలీట్ చేసుకోండి!
- US: అబార్షన్ హక్కుపై అమెరికా సుప్రీం సంచలన తీర్పు
- Super Tax: పాక్‌లో ‘సూపర్’ పన్ను!
- 50 States: ఎన్నికల తర్వాత దేశంలో 50 రాష్ట్రాలు.. కర్ణాటక మంత్రి సంచలన వ్యాఖ్యలు
- Triglycerides: ట్రైగ్లిజరైడ్ కొవ్వును కరిగించేదెలా అని చింతించొద్దు
- Maharashtra Crisis: క్యాన్సర్ ఉన్నా.. శివసేన నన్ను పట్టించుకోలేదు: రెబల్ ఎమ్మెల్యే భావోద్వేగం
- IND vs LEIC Practice Match : భళా అనిపించిన భారత బౌలర్లు.. మెరిసిన పంత్
- నాతో పెళ్లి.. తనతో ప్రేమేంటి?
- Presidential Election: అట్టహాసంగా ద్రౌపది నామినేషన్