చైనా సైన్యం: ఏ పరిస్థితులకైనా సిద్ధంగా ఉండండి!

చైనా సైనికులు తమ పోరాట నైపుణ్యాలను మెరుగుపరచుకోవడంతో పాటు ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు ఏ క్షణమైనా సిద్ధంగా ఉండాలని చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ పిలుపునిచ్చారు.

Published : 06 Jan 2021 01:26 IST

పిలుపునిచ్చిన అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌

బీజింగ్‌: చైనా సైనికులు తమ పోరాట నైపుణ్యాలను మెరుగుపరచుకోవాలని చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ పిలుపునిచ్చారు. ఏ క్షణంలోనైనా ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. సైనిక అధికారాల సవరణ చట్టం అమల్లోకి వచ్చిన సందర్భంగా జిన్‌పింగ్‌ చైనా సైన్యానికి కొన్ని సూచనలు చేశారు.

ప్రపంచంలో అతిపెద్ద సైనిక వ్యవస్థ కలిగిన చైనాలో అధ్యక్ష బాధ్యతలతోపాటు అక్కడి సెంట్రల్‌ మిలటరీ కమిషన్‌(సీఎంసీ) బాధ్యతలు అధ్యక్షుడి చేతుల్లోనే ఉన్నాయి. అయితే, తాజాగా అక్కడి సైనిక అధికారాలను విస్తరించే చట్టాన్ని సవరించడంతో అధ్యక్షుడికి మరిన్ని అధికారాలు వచ్చాయి. అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ ఆలోచనలకు అనుగుణంగా చైనా లక్షణాలు కలిగిన సోషలిజం భావాలను సైన్యం అలవరచుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది. ప్రస్తుతం ఉన్న సైనిక శిక్షణా విధానాన్ని సంస్కరించడంపై దృష్టి సారించడంతో పాటు సాయుధ దళాలు ఎలాంటి పోరాటానికైనా సిద్ధంగా ఉండే విధంగా తమ నైపుణ్యాలను మెరుగుపరచుకోవాలని పిలుపునిచ్చింది. తాజాగా సైనిక శిక్షణా శిబిరం ప్రారంభం నేపథ్యంలో షీ జిన్‌పింగ్‌ సైనికులకు పలు సూచనలు చేశారు. 

ఇవీ చదవండి..
చైనా నుంచే నేర్చుకుంటాం: పాకిస్థాన్‌
మరోసారి బయటపడ్డ చైనా కుయుక్తులు!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని