రాహుల్‌ గాంధీపై మాజీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు

కేరళలోని ఇడుక్కి మాజీ ఎంపీ జోయిస్‌ జార్జ్‌.. కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాహుల్‌ గాంధీతో జాగ్రత్తగా ఉండాలని యువతులను హెచ్చరించారు....

Updated : 31 Mar 2021 09:45 IST

ఇడుక్కి: కేరళలోని ఇడుక్కి మాజీ ఎంపీ జోయిస్‌ జార్జ్‌.. కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాహుల్‌ గాంధీతో జాగ్రత్తగా ఉండాలని యువతులను హెచ్చరించారు. ఇడుక్కిలో ఎల్డీఎఫ్‌ తరఫున పోటీ చేస్తున్న ఎంఎం మణికి మద్దతుగా జోయిస్‌ జార్జ్‌ ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘అమ్మాయిలూ జాగ్రత్త.. రాహుల్‌ గాంధీ ఓ బ్యాచిలర్‌‌’ అని జార్జ్‌ పేర్కొన్నారు.

కాగా జార్జ్‌ వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలపై మంగళవారం సాయంత్రం రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టేందుకు కాంగ్రెస్‌ నిర్ణయించింది. ‘ఓ ప్రజాప్రతినిధి ఈ తరహాలో ఆలోచించడం దురదృష్టకరం. ఆయనపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలి’ అని ప్రతిపక్ష నేత రమేష్‌ చెన్నితాల పేర్కొన్నారు. కాగా జార్జ్‌ వ్యాఖ్యలపై ఎంఎం మణి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. అమ్మాయిల గురించి అనుచితంగా మాట్లాడలేదని, రాహుల్‌ గాంధీని విమర్శించేందుకే ఈ తరహా వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు.

కొద్దిరోజుల క్రితం కేరళలో పర్యటించిన రాహుల్‌ గాంధీ కొచ్చిలోని సెయింట్‌ థెరెస్సా కళాశాల విద్యార్థినులకు ‘ఐకిడో’ అనే మార్షల్‌ ఆర్ట్స్‌లో మెళకువలు నేర్పించారు. జపాన్‌కు చెందిన ఐకిడో మార్షల్‌ ఆర్ట్స్‌లో రాహుల్‌ గాంధీ శిక్షణ తీసుకున్నారు. విద్యార్థినుల అభ్యర్థన మేరకే ఆయన వారికి మెళకువలు నేర్పించారు. ఎవరైనా దాడికి పాల్పడితే ఎలా ఎదుర్కోవాలో నేర్పించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని