కళ్లు చిన్నగా ఉంటే ప్రయోజనాలివీ.. నవ్వులు పూయిస్తున్న మంత్రి వ్యాఖ్యలు

కళ్లు చిన్నగా ఉంటే ప్రయోజనాలు ఇవీ అంటూ నాగాలాండ్‌ విద్యాశాఖ మంత్రి చేసిన వ్యాఖ్యలు నవ్వులు పూయిస్తున్నాయి........

Published : 10 Jul 2022 01:24 IST

కోహిమా: ‘కళ్లు చిన్నగా ఉంటే ప్రయోజనాలు ఇవీ’ అంటూ నాగాలాండ్‌ విద్యాశాఖ మంత్రి చేసిన వ్యాఖ్యలు నవ్వులు పూయిస్తున్నాయి. మంత్రి తెమ్జెన్‌ ఇన్మా తనపై తాను వేసుకున్న జోకులకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. నాగాలాండ్‌ విద్యాశాఖ, గిరిజన వ్యవహారాల మంత్రి తెమ్జెన్‌ ఇన్మా ఓ సమావేశంలో మాట్లాడుతూ.. చిన్న కళ్లు ఉంటే ప్రయోజనాలను వివరించారు.

‘ఈశాన్య రాష్ట్రాల ప్రజలకు కళ్లు చిన్నగా ఉంటాయని కొందరు వెక్కిరిస్తుంటారు. ఔను మా కళ్లు చిన్నగానే ఉంటాయి. కానీ చాలా మంచిగా చూడగలం. చిన్న కళ్లు ఉండటం వల్ల ప్రయోజనాలున్నాయి. కళ్లల్లో దుమ్ము, ధూళి తక్కువగా చేరుతుంది. ఇదేగాక, భారీ సమావేశాల్లో అధిక సమయం స్టేజిమీద కూర్చున్నప్పుడు నిద్రపోయినా ఎవరూ గుర్తించలేరు’ అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. ఇందుకు సంబంధించిన వీడియోను జర్నలిస్ట్‌ శుభంకర్‌ మిశ్రా ట్విటర్‌లో పంచుకోగా ఇప్పటికే 1.1మిలియన్ల మంది వీక్షించారు. ఆ ట్వీట్‌ను మంత్రి ఇన్మా రీట్వీట్‌ చేస్తూ ఆనందం వ్యక్తం చేశారు. ఈశాన్య రాష్ట్రాల ప్రజల వాణిని ప్రజల్లోకి తీసుకెళ్లినందుకు ధన్యవాదాలు తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని