Published : 07/08/2021 01:36 IST

Rajastan: యాచకులకు ఉద్యోగాలు.. రాజస్థాన్‌ ప్రభుత్వం వినూత్న పథకం

జయపుర: యాచకుల జీవితం ఎంతో దుర్భరంగా ఉంటుంది. భిక్షాటన చేస్తూ కడుపు నింపుకోవడం.. రోడ్ల పక్కన నిద్రించడం మాత్రమే వారికి తెలుసు. అందుకే, వారికంటూ ఒక మంచి జీవితాన్ని అందించాలని రాజస్థాన్‌ ప్రభుత్వం ఒక చక్కటి పథకాన్ని అమలు చేస్తోంది. ఇందులో భాగంగా ఇటీవల 60 మంది యాచకులకు ఉద్యోగాలు కల్పించింది. ‘వొకేషనల్‌ ట్రెనియింగ్‌ ఫర్‌ లైఫ్‌ విత్‌ డిగ్నిటీ’ పేరుతో రాజస్థాన్‌ స్కిల్‌ అండ్‌ లైవ్‌లీహుడ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఆర్‌ఎస్‌ఎల్‌డీసీ) సంస్థ అమలు చేస్తున్న ఈ పథకంలో భాగంగా అధికారులు యాచకులకు ఏడాదిపాటు వివిధ వృత్తిపరమైన కోర్సుల్లో శిక్షణ ఇప్పిస్తున్నారు. అనంతరం వివిధ సంస్థల్లో ఉద్యోగాలు కల్పిస్తున్నారు.

ఈ పథకం గురించి ఆర్‌ఎస్‌ఎల్‌డీసీ డైరెక్టర్‌ నీరజ్‌ కె. పవన్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో యాచకులు అనేవారు ఉండకూడదనేది రాజస్థాన్‌ ముఖ్యమంత్రి కల అని, యాచకులందరికీ మంచి జీవితాన్ని అందించాలని సంకల్పించిన సీఎం సూచనల మేరకే ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. ‘‘తొలుత రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న 100 మంది యాచకులకు ఏడాదిపాటు శిక్షణ ఇచ్చాం. ప్రస్తుతం 60 మంది శిక్షణ పూర్తయి ఉద్యోగాలు పొందారు. మిగతా వారు ఇంకా శిక్షణ తీసుకుంటున్నారు. శిక్షణ తీసుకొని, ఉద్యోగంలో చేరేలా వారిని మానసికంగా సిద్ధం చేయడానికి 15 నుంచి 20 రోజులు పట్టింది. ఆ తర్వాత వారంతా శ్రద్ధగా శిక్షణ పొందారు’’ అని పవన్‌ తెలిపారు.

ఇటీవల రెడ్‌ పెప్పర్‌ అనే రెస్టారెంట్‌లో 12 మంది యాచకులు ఉద్యోగులుగా చేరారు. రెండువారాలపాటు వారికి శిక్షణ ఇచ్చామని, అనంతరం వారు చక్కగా పనిచేసుకుంటున్నారని రెస్టారెంట్‌ డైరెక్టర్‌ రాజీవ్‌ కంపనీ తెలిపారు. వారంతా ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉన్నారని, మరికొంత మందిని తమ రెస్టారెంట్లో ఉద్యోగులుగా చేర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని