China: చైనాను బూచిగా చూపిస్తున్నారు..!

నాటో కూటమి తనను బూచిగా చూపించి వివాదాలను సృష్టిస్తోందని చైనా విరుచుకుపడింది. ఐరోపా సమాఖ్యలోని చైనా దౌత్యకార్యాలయం నాటో ప్రకటనపై స్పందించింది. ‘‘చైనా అభివృద్ధిని సరైన దృష్టితో చూడండి.

Updated : 21 Dec 2022 16:36 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: నాటో కూటమి తనను బూచిగా చూపించి వివాదాలను సృష్టిస్తోందని చైనా విరుచుకుపడింది. ఐరోపా సమాఖ్యలోని చైనా దౌత్యకార్యాలయం నాటో ప్రకటనపై స్పందించింది. ‘‘చైనా అభివృద్ధిని సరైన దృష్టితో చూడండి. అనవసరంగా చైనా ముప్పు అన్న కోణంలో ఎక్కువగా ఊహించుకోవద్దు. చైనా హక్కులు, లక్ష్యాలను మీ బృంద రాజకీయాల కోసం వక్రీకరించి కృత్రిమ వివాదాలు సృష్టించవద్దు. చైనా అభివృద్ధిపై దుష్ప్రచారం చేయడం, అంతర్జాతీయ పరిస్థితులకు వక్ర భాష్యాలు చెప్పటం వంటివి ప్రచ్ఛన్న యుద్ధ మనస్తత్వానికి కొనసాగింపులానే ఉన్నాయి’’ అని పేర్కొంది. అంతకుముందు జీ7 బృందంపై కూడా చైనా విమర్శలు చేసింది. రాజకీయ వక్రీకరణకు పాల్పడుతోందని ఆరోపించింది.

చైనా నుంచి పొంచి ఉన్న వ్యవస్థీకృతమైన సవాళ్లను సమష్టిగా ఎదుర్కొంటామని నాటో కూటమి నేతలు సోమవారం ప్రకటించారు. ఈ సమావేశంలో అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ సహా పలువురు కీలక నేతలు పాల్గొన్నారు. అణ్వాయుధాలను పెంచుకోవడంతోపాటు.. సైబర్‌, స్పేస్‌ యుద్ధ తంత్రాల్లోని సామర్థ్యాలతో ప్రపంచాన్ని చైనా భయపెడుతోందని ఆరోపించారు. రష్యాతో ఆ దేశ సైనిక సంబంధాలపై ఆందోళన వ్యక్తం చేశారు. తాము చైనాను శత్రువుగా చూడకపోయినా.. ఆదేశ తీరు తమ రక్షణకు ముప్పుగా మారుతోందని నాటో చీఫ్‌ జెన్స్‌ పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని