
West Bengal: సువేందుకు ‘ఊరట’పై బెంగాల్ ప్రభుత్వం సవాల్..
కోల్కతా: పశ్చిమబెంగాల్ ప్రతిపక్ష నేత సువేందు అధికారికి ఊరటనిస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సవాల్ చేసింది. క్రిమినల్ కేసుల్లో సువేందుపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోకూడదంటూ సోమవారం హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ తృణమూల్ ప్రభుత్వం డివిజన్ బెంచ్ ముందు అప్పీల్ చేసింది. దీనిపై న్యాయస్థానం రేపు విచారణ చేపట్టే అవకాశముంది. సువేందు అధికారిపై నమోదైన ఐదు క్రిమినల్ కేసుల్లో మూడింటి విచారణపై హైకోర్టు సింగిల్ బెంచ్ నిన్న స్టే విధించింది. మిగిలన రెండు కేసుల్లో దర్యాప్తునకు సమ్మతి తెలుపుతూనే తమ అనుమతి లేకుండా బలవంతపు చర్యలు తీసుకోకూడదని, అరెస్టు చేయకూడదని ఆదేశించింది. తన అంగరక్షకుడు శుభబ్రత చక్రవర్తి అనుమానాస్పద మృతిపై సీఐడీ దర్యాప్తు చేస్తున్న కేసుతోపాటు రాజకీయ ఘర్షణ, గొలుసు దొంగతనం కేసుల విచారణను ధర్మాసనం నిలిపివేసింది. ఉద్యోగాల కుంభకోణం, పోలీసులపై బెదిరింపులకు సంబంధించిన కేసుల్లో దర్యాప్తును కొనసాగించడానికి అంగీకారం తెలిపింది. భవిష్యత్తులోనూ ఆయనపై నమోదు చేసే కేసులకు సంబంధించి తమకు సమాచారం అందించాలని పశ్చిమబెంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతోపాటు ప్రజాప్రతినిధిగా ఆయనకున్న బాధ్యతల దృష్ట్యా కేసుల విచారణలో తనకు వీలున్న సమయంలో, తగిన ప్రదేశంలో వాంగ్మూలం ఇవ్వడానికి స్వేచ్ఛనిచ్చింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.