World Sleep Day: హ్యాపీగా నిద్రపోండి.. ఉద్యోగులకు ఓ సంస్థ గిఫ్ట్‌..!

అంతర్జాతీయ నిద్ర దినోత్సం(World Sleep Day) సందర్భంగా బెంగళూరుకు చెందిన ఓ సంస్థ తన ఉద్యోగులను ఆశ్చర్యపర్చింది. 

Updated : 17 Mar 2023 15:09 IST

బెంగళూరు: కంటికి సరిపడా నిద్ర(Sleep) పోతోనే.. ఒంటికి అలసట తీరుతుంది. రోజు ఉత్సాహంగా కనిపిస్తుంది. పనిలో,ఆలోచనల్లో స్పష్టత  ఉంటుంది. ఇవన్నీ నిపుణులు చెప్పే మాటలు. ప్రపంచ నిద్ర దినోత్సవం(World Sleep Day)(March 17) వేళ  బెంగళూరుకు చెందిన వేక్‌ఫిట్‌ సొల్యూషన్స్(Wakefit Solutions) సంస్థ ఓ సానుకూల నిర్ణయం తీసుకొంది. నేడు ఉద్యోగులకు ఐచ్ఛిక సెలవును ప్రకటించింది. తన సిబ్బందికి ఆరోగ్యకర జీవనాన్ని అలవర్చే దిశగా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని సదరు సంస్థ లింక్డిన్‌లో పోస్టు చేసింది.

‘ప్రపంచ నిద్ర దినోత్సవం(World Sleep Day) సందర్భంగా మార్చి17, 2023న వేక్‌ఫిట్ ఉద్యోగులందరికీ ఒకరోజు విశ్రాంతి ఇస్తున్నాం. ఆ లాంగ్‌ వీకెండ్‌లో తగిన సేదదీరడానికి ఇది సరైన అవకాశం’ అని ఉద్యోగులకు మెయిల్‌ను పంపింది. ఆ మెయిల్‌ను ‘‘Surprise Holiday: Announcing the Gift of Sleep’’పేరిట పంపింది. పరుపులు, సోఫాలు విక్రయించే ఈ సంస్థ ఇలా ఉద్యోగులకు నిద్రను కానుకగా ఇచ్చింది. 

‘గ్రేట్ ఇండియన్ స్లీప్‌ స్కోర్‌ కార్డు పేరిట నిర్వహించిన ఆరో విడత సర్వేలో.. 2022 నుంచి చూస్తే పనివేళ్లల్లో నిద్రముంచుకు వచ్చే(feeling sleepy) వారి సంఖ్య 21శాతం పెరిగినట్లు తేలింది. అలసటతో నిద్ర(Sleep) లేచేవారి విషయంలో 11 శాతం పెరుగుదల కనిపించింది. ఈ నిద్రలేమి పరిస్థితులను పరిశీలిస్తే.. ప్రస్తుతకాలంలో ‘నిద్ర బహుమతి’(Gift Of Sleep)కి మించిందేముంది. నిద్ర ప్రియులుగా ఈ రోజును మేం ఓ పండుగగా పరిగణిస్తాం. ఇక అది శుక్రవారం వస్తే అంతకు మించిన ఆనందం ఏముంటుంది’ అని వేక్‌ఫిట్  సందేశంలోపేర్కొంది.  ఇలా ఉద్యోగులకు ఉపయోగపడే అనూహ్య నిర్ణయాలు తీసుకోవడం ఈ సంస్థకు కొత్తేం కాదు. గతంలో ‘రైట్‌ టు న్యాప్‌’(Right to Nap policy) పాలసీని తీసుకువచ్చింది. పనివేళల్లో సంస్థ ఉద్యోగులు అరగంట పాటు నిద్రపోవడానికి అనుమతినిచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని