Bengaluru-Mysuru: పది వరసల మార్గం.. ప్రత్యేకతలు అనేకం

బెంగళూరు-మైసూరు నగరాల మధ్య రూ.8,478 కోట్లతో నిర్మించిన జాతీయ రహదారి (275)ని ప్రధాని మోదీ ఆదివారం ప్రారంభించనున్నారు.

Updated : 11 Mar 2023 10:09 IST

బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్‌టుడే: బెంగళూరు-మైసూరు నగరాల మధ్య రూ.8,478 కోట్లతో నిర్మించిన జాతీయ రహదారి (275)ని ప్రధాని మోదీ ఆదివారం ప్రారంభించనున్నారు. భారతమాల పరియోజన పథకంలో భాగంగా 118 కి.మీ. మేర నిర్మించిన ఈ మార్గంలో ఆరువరసల ప్రధాన రహదారితోపాటు ఇరువైపులా నాలుగు వరుసల సర్వీసు రోడ్డు ఉంది. ఈ ఉభయ నగరాల మధ్య 155 కి.మీ. దూరం కాగా వీటి శివార్ల మధ్య ఉన్న 118 కి.మీ. దూరానికి రాష్ట్ర ప్రభుత్వం భూమిని సమకూర్చగా, జాతీయ రహదారుల అభివృద్ధి ప్రాధికార సంస్థ నిర్మాణ పనులు చేపట్టింది. ఇప్పటి వరకు ఈ రెండు నగరాల మధ్య ప్రయాణ సమయం మూడు గంటలు కాగా, ఈ రహదారి నిర్మాణంతో అది 90 నిమిషాలకు తగ్గనుంది. అవసరానికి అనుగుణంగా ఈ రహదారిపై హెలికాప్టర్లను కూడా దింపవచ్చని అధికారులు తెలిపారు. మధ్యలో వచ్చే నగరాలు, పట్టణాలకు వెళ్లేందుకు ఎగ్జిట్ మార్గాలు ఉన్నాయి. ఈ రహదారిలో 40 చిన్న వంతెనలు, 89 అండర్‌పాస్‌, ఓవర్‌పాస్‌లు ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని