CoronaVirus: బీఎఫ్.7 వేరియంట్ తీవ్రత తక్కువే.. కానీ వాళ్లు మాత్రం జాగ్రత్త!
పలు ప్రపంచ దేశాల్లో కొవిడ్ కేసులు పెరుగుతుండటంతో కర్ణాటక ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పలు ఆంక్షలు ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈరోజు మాక్‌డ్రిల్ నిర్వహించిన సందర్భంగా ఆరోగ్యమంత్రి సుధాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
బెళగావి: దేశంలో కలవరం రేపుతోన్న బీఎఫ్.7 వేరియంట్(BF7.variant) తీవ్రత తక్కువగానే ఉన్నప్పటికీ సీనియర్ సిటిజన్లు(Senior cizens), చిన్నారులు(Children), గర్భిణులు(pregnant) అత్యంత జాగ్రత్తగా ఉండాలని కర్ణాటక(Karnataka) ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ కె.సుధాకర్ విజ్ఞప్తి చేశారు. చైనా, జపాన్, అమెరికా సహా పలు ప్రపంచ దేశాల్లో కరోనా కేసులు విజృంభిస్తున్న నేపథ్యంలో కరోనా(CoronaVirus)ను ఎదుర్కొనేందుకు సన్నద్ధతలో భాగంగా ఏర్పాటు చేసిన మాక్‌డ్రిల్ కార్యక్రమం సందర్భంగా బెళగావిలో మంత్రి మాట్లాడారు. కరోనా కేసులు పెరిగితే ఎదుర్కోనే అంశంపై సన్నద్ధతలో భాగంగా అన్ని జిల్లాలు, తాలుకాల్లో ఈ మాక్ డ్రిల్స్ నిర్వహించినట్టు తెలిపారు.
‘‘బీఎఫ్7 వేరియంట్ అనేది ఒమిక్రాన్‌కు ఉప రకం. ఇతర వేరియంట్‌లతో పోలిస్తే దీని వ్యాప్తి రేటు అధికంగా ఉన్నప్పటికీ.. తీవ్రత మాత్రం తక్కువగానే ఉంది. పలు దేశాల నుంచి వస్తోన్న నివేదికలు వృద్ధులు, దీర్ఘాకాలిక అనారోగ్యాలతో ఉన్న వారిలో మాత్రం ఈ వైరస్ తీవ్రత కాస్త అధికంగానే ఉన్నట్టు సూచిస్తున్నాయి. నిన్న కర్ణాటక ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేయడానికి కారణం కూడా అదే. వృద్ధులు, దీర్ఘకాలిక అనారోగ్యంతో ఉన్నవారు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. జనంతో ఎక్కువ రద్దీగా ఉండే ప్రాంతాలు, కార్యక్రమాలకు దూరంగా ఉండాలి. ఒకవేళ తప్పనిసరిగా వెళ్లాల్సిన పరిస్థితి వస్తే మాస్కులు ధరించాలి. చిన్నారులు, గర్భిణులూ ఇదే రకమైన జాగ్రత్తలు పాటించాలి’’ అని మంత్రి విజ్ఞప్తి చేశారు.
అంతర్జాతీయ ప్రయాణికులపై నిఘా ఉంచాలని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసిందన్నారు. అంతర్జాతీయ ప్రయాణికులకు తమ రాష్ట్రంలో ఎంట్రీ పాయింట్లు బెంగళూరు, మంగళూరు ఉన్నాయని.. అక్కడ గట్టి నిఘా ఉంచామని చెప్పారు. అంతర్జాతీయ ప్రయాణికులపై నిఘా ఉంచడానికి తీసుకున్న చర్యల్ని పరిశీలించేందుకు త్వరలోనే తాను ఆయా ప్రాంతాలకు వెళ్తానని మంత్రి చెప్పారు.
మరోవైపు, పలు దేశాల్లో కొవిడ్ కేసులు విజృంభిస్తండటంతో కర్ణాటక ప్రభుత్వం ఇప్పటికే అప్రమత్తమైంది. ఇందులో భాగంగా సోమవారం కొవిడ్ కట్టడికి పలు మార్గదర్శకాలు విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా సినిమా థియేటర్లు, పాఠశాలలు, కళాశాలల్లో మాస్కులు ధరించడం తప్పనిసరి చేసింది. అలాగే, వృద్ధులు రద్దీ ప్రదేశాల్లో తిరగవద్దని కోరింది. బార్లు, రెస్టారంట్లు, పబ్‌లలోకి వెళ్లే వారికి రెండు డోసుల వ్యాక్సినేషన్ తప్పనిసరని.. సీటింగ్ సామర్థ్యానికి మంచి లోపలికి అనుమతించరాదని హెచ్చరించింది. డిసెంబర్ 31న కొత్త సంవత్సర వేడుకల సమయాన్ని రాత్రి 1గంటకు కుదించిన విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Uttar Pradesh : నాపై కక్షతో చేతబడి చేశారు.. యూపీ ఎమ్మెల్యే పోస్టు వైరల్
-
Meenakshi Chaudhary: మరో స్టార్హీరో సరసన మీనాక్షి చౌదరి.. ఆ వార్తల్లో నిజమెంత?
-
Congress: అజయ్ మాకెన్‌కు కీలక పదవి!
-
Supriya Sule: ఆ రెండు పార్టీల చీలిక వెనక.. భాజపా హస్తం: సుప్రియా
-
KTR: ఓఆర్ఆర్ చుట్టూ సైకిల్ ట్రాక్.. ప్రారంభించిన మంత్రి కేటీఆర్
-
Top 10 News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు