Bhagwant Mann: పంజాబ్‌ కొత్త సీఎంగా భగవంత్‌ మాన్‌ ప్రమాణం

పంజాబ్‌లో ‘ఆమ్‌ ఆద్మీ’ ప్రభుత్వం కొలువుదీరింది. నూతన ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ బుధవారం ప్రమాణస్వీకారం చేశారు. స్వాతంత్ర్య సమరయోధుడు భగత్‌ సింగ్‌ స్వగ్రామమైన

Updated : 16 Mar 2022 14:47 IST

ఖట్కర్‌ కలన్‌: పంజాబ్‌లో ‘ఆమ్‌ ఆద్మీ’ ప్రభుత్వం కొలువుదీరింది. నూతన ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ బుధవారం ప్రమాణస్వీకారం చేశారు. స్వాతంత్ర్య సమరయోధుడు భగత్‌ సింగ్‌ స్వగ్రామమైన ఖట్కర్‌ కలన్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి ఆమ్‌ ఆద్మీ పార్టీ చీఫ్‌, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌, పార్టీ సీనియర్‌ నేతలు హాజరయ్యారు. పంజాబ్‌ గవర్నర్‌ భన్వరీలాల్‌ పురోహిత్‌.. మాన్‌ చేత ప్రమాణం చేయించారు. ఆ తర్వాత ఇదే వేదికపై సీఎం బాధ్యతలు స్వీకరించారు.

ఈ కార్యక్రమానికి పంజాబ్‌ ప్రజలంతా బాసంతి(పసుపు రంగు) తలపాగాలు ధరించి మాన్‌ను ఆహ్వానించిన విషయం తెలిసిందే. దీంతో ఖట్కర్‌ కలన్‌ గ్రామం నేడు పసుపువర్ణమైంది. దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ కూడా పసుపు రంగు తలపాగా ధరించి కన్పించారు. 

ఇటీవల జరిగిన పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అఖండ విజయం సాధించిన విషయం తెలిసిందే. మొత్తం 117 స్థానాలున్న పంజాబ్‌ అసెంబ్లీలో 92 సీట్లు గెలిచి ప్రభంజనం సృష్టించింది. సంగ్రూర్‌ జిల్లా ధురి నుంచి పోటీ చేసిన భగవంత్‌ మాన్‌ 58వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని