NCERT: ‘ఇండియా స్థానంలో భారత్‌’.. వివాదం అనవసరం - ఎన్‌సీఈఆర్‌టీ

పాఠ్యపుస్తకాల్లో ఇండియా స్థానంలో భారత్‌ అని మార్చడంపై ఎన్‌సీఈఆర్‌టీ డైరెక్టర్‌ దినేశ్‌ ప్రసాద్‌ సక్లానీ స్పష్టతనిచ్చారు.

Updated : 17 Jun 2024 18:58 IST

దిల్లీ: ఎన్‌సీఈఆర్‌టీ (NCERT) తాజాగా విడుదల చేసిన పుస్తకాల్లో పలు మార్పులు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే పాఠ్యాంశాల్లో కాషాయీకరణ చోటుచేసుకుంటోందన్న ఆరోపణలు రాగా.. తాజాగా అన్ని తరగతుల సాంఘిక శాస్త్రం పుస్తకాల్లో ‘ఇండియా’ బదులు ‘భారత్‌’ అని రాయవచ్చంటూ ఉన్నతస్థాయి కమిటీ చేసిన సిఫార్సు చేయడం చర్చకు దారితీసింది. దీనిపై ఎన్‌సీఈఆర్‌టీ డైరెక్టర్‌ దినేశ్‌ ప్రసాద్‌ సక్లానీ (Dinesh Prasad Saklani) తాజాగా స్పందించారు.

ప్రస్తుతం దీనిపై చర్చ అనవసరమని దినేశ్‌ అన్నారు. రాజ్యాంగం ప్రకారమే రెండింటీనీ సందర్భానికి అనుగుణంగా వాడుకోవచ్చని స్పష్టం చేశారు. ‘‘మేము రాజ్యాంగాన్ని అనుసరిస్తాం. ‘భారత్‌’, ‘ఇండియా’ పదాల పట్ల మాకు వ్యతిరేక భావనేమీ లేదు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఎలాంటి మార్పులు చేయలేదు. సందర్భానికి తగట్లుగా పదాలను వాడుకోవచ్చు. ప్రస్తుతం దీనిపై చర్చ జరపడం అనవసరం’’ అని పేర్కొన్నారు.

స్పీకర్ పదవిపై ఉత్కంఠ.. తమ దగ్గరే ఉండాలనుకుంటున్న భాజపా..!

గతేడాది ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్యపుస్తకాల్లో ‘ఇండియా’ పదాన్ని ‘భారత్‌’గా మార్చాలని ఉన్నతస్థాయి కమిటీ సిఫార్సు చేసింది. భారత్‌కు ఆ పేరు 7 వేల సంవత్సరాల క్రితం నుంచే ఉందని భావించిన కమిటీ ఈ మార్పు చేసినట్లు తెలుస్తోంది. అదేవిధంగా సిలబస్‌లో కొన్ని అంశాలను పూర్తిగా తొలగించింది. నాటి నుంచి దీనిపై జోరుగా చర్చ సాగుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని