నేడు భారత్‌ బంద్‌

జీఎస్టీ నిబంధనలను సమీక్షించాలని డిమాండ్‌ చేస్తూ ఫిబ్రవరి 26 శుక్రవారం దేశవ్యాప్తంగా బంద్‌కు పిలుపునిస్తున్నట్లు అఖిల భారత వ్యాపారుల సమాఖ్య (సీఏఐటీ) తెలిపింది. ఈ నేపథ్యంలో శుక్రవారం దేశంలోని అన్ని వాణిజ్య మార్కెట్లు మూసిఉంటాయని వారు గురువారం తెలిపారు.

Updated : 26 Feb 2021 06:31 IST

అఖిల భారత వ్యాపారుల సమాఖ్య పిలుపు

దిల్లీ: జీఎస్టీ నిబంధనలను సమీక్షించాలని డిమాండ్‌ చేస్తూ ఫిబ్రవరి 26 శుక్రవారం దేశవ్యాప్తంగా బంద్‌కు పిలుపునిస్తున్నట్లు అఖిల భారత వ్యాపారుల సమాఖ్య (సీఏఐటీ) తెలిపింది. ఈ నేపథ్యంలో శుక్రవారం దేశంలోని అన్ని వాణిజ్య మార్కెట్లు మూసిఉంటాయని వారు గురువారం తెలిపారు. జీఎస్టీ బిల్లును సమీక్షించాలన్న డిమాండ్‌తో పాటు పెరుగుతున్న గ్యాస్‌, పెట్రోల్‌ ధరలకు నిరసనగా ఈ బంద్‌కు పిలుపునిచ్చామని సీఏఐటీ జనరల్‌ సెక్రటరీ ప్రవీణ్‌ ఖండేల్‌వాల్‌ తెలిపారు. దేశవ్యాప్తంగా ఇంధన ధరలు ఒకేలా ఉండేలా చూడాలని డిమాండ్‌ చేస్తున్నామన్నారు. ఈ బంద్‌కు అఖిల భారత రవాణా సంక్షేమ సంఘం (ఏఐటీడబ్ల్యూఏ) తమ మద్దతును తెలిపింది. ఇందులో భాగంగా చక్కాజామ్‌కు పిలుపునిస్తున్నట్లు వారు తెలిపారు. భారత్‌ బంద్‌లో 40వేల వాణిజ్య సంఘాలు పాల్గొంటున్నాయని సీఏఐటీ తెలిపింది. నలభైలక్షల వాహనాలు నిలిపివేస్తామని తెలిపారు. దేశవ్యాప్తంగా 1,500 ప్రాంతాల్లో ఈ నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తామని వారు వెల్లడించారు.

భారత్‌బంద్‌ నేపథ్యంలో జీఎస్టీ నిబంధనల్లో సవరణలు చేయాలంటూ గత ఆదివారం సీఏఐటీ ప్రధాని మోదీకి లేఖ రాసింది. ఈ-కామర్స్‌ సంస్థలపై నియంత్రణ చర్యలు చేపట్టాలని వారు అందులో పేర్కొన్నారు. జీఎస్టీ బిల్లులో సవరణలకు కేంద్రస్థాయి అధికారులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని వారు కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని