Bharat Bhandh: రైతుల ఆందోళన.. 27న భారత్‌ బంద్‌

కేంద్రం తీసుకొచ్చిన సాగు చట్టాలపై గత కొద్ది నెలలుగా పోరాడుతున్న రైతు సంఘాల సమాఖ్య సంయుక్త కిసాన్‌ మోర్చా ఆందోళన ఉద్ధృతం చేసేందుకు నిర్ణయించింది. ఇందులో భాగంగా సెప్టెంబర్‌ 25న భారత్‌ బంద్‌కు పిలుపునిచ్చింది.

Published : 05 Sep 2021 21:39 IST

ముజఫర్‌నగర్‌ (యూపీ): కేంద్రం తీసుకొచ్చిన సాగు చట్టాలపై గత కొద్ది నెలలుగా పోరాడుతున్న రైతు సంఘాల సమాఖ్య సంయుక్త కిసాన్‌ మోర్చా ఆందోళన ఉద్ధృతం చేసేందుకు నిర్ణయించింది. ఇందులో భాగంగా సెప్టెంబర్‌ 25న భారత్‌ బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ మేరకు యూపీలోని ముజఫర్‌నగర్‌లో నిర్వహించిన కిసాన్‌ మహా పంచాయత్‌ కార్యక్రమంలో రైతు సంఘాల నేతలు తమ నిర్ణయాన్ని ప్రకటించారు. ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాలకు చెందిన 300 రైతు సంఘాల ప్రతినిధులతో పాటు పెద్ద ఎత్తున రైతులు హాజరైనట్లు నిర్వాహకులు తెలిపారు.

‘‘కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ కొద్దిమంది రైతులు మాత్రమే నిరసన చేపడుతున్నారని కేంద్రం చెబుతోంది. ఎంత తక్కువ మంది నిరసన తెలుపుతున్నామో ఇప్పుడు చూడండి. పార్లమెంటులో కూర్చున్న వారికి తమ గళాలు వినిపించేలా ఉద్యమిస్తాం’’ అని రైతు నేతలు ఈ సందర్భంగా పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఇలాంటి సమావేశాలు మరిన్ని జరుగుతాయని భారతీయ కిసాన్‌ యూనియయన్‌ (బీకేయూ) జాతీయ అధికార ప్రతినిధి రాకేశ్‌ టికాయిత్‌ పేర్కొన్నారు. దేశాన్ని అమ్మకుండా ఆపడమే ఈ సమావేశం లక్ష్యమని వివరించారు. దేశాన్ని, రైతులను, ఉద్యోగులను, యువతను కాపాడడమే ధ్యేయమని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని