Bharat Biotech: బూస్టర్‌ డోసుగా ‘ఇన్‌కొవాక్‌’కు సీడీఎస్‌సీఓ అనుమతి

కొవిడ్‌ కట్టడికి భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన చుక్కల మందు టీకా ‘ఇన్‌కొవాక్‌(iNCOVACC)’ను బూస్టర్‌ డోసుగా వినియోగించేందుకు సెంట్రల్‌ డ్రగ్స్‌ స్టాండర్డ్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌(CDSCO) నుంచి అనుమతి లభించించింది.

Published : 28 Nov 2022 23:57 IST

దిల్లీ: కొవిడ్‌ కట్టడికి భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన చుక్కల మందు (నాసల్‌ వ్యాక్సిన్‌) టీకా ‘ఇన్‌కొవాక్‌(iNCOVACC)’ను బూస్టర్‌ డోసుగా వినియోగించేందుకు సెంట్రల్‌ డ్రగ్స్‌ స్టాండర్డ్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌(CDSCO) నుంచి అనుమతి లభించించింది. కొవిడ్‌ను ఎదుర్కోవడంలో ప్రైమరీ సిరీస్‌తోపాటు భిన్న టీకాలు తీసుకున్న వారికి బూస్టర్‌ డోసుగా ఇచ్చేందుకు అనుమతి పొందిన చుక్కల మందు టీకా ప్రపంచంలో ఇదే మొదటిదని ‘భారత్‌ బయోటెక్‌’ ఓ ప్రకటనలో వెల్లడించింది.

అమెరికాలోని వాషింగ్టన్‌ యూనివర్సిటీ- సెయింట్‌ లూయీస్‌ భాగస్వామ్యంతో భారత్‌ బయోటెక్‌ ఈ టీకాను అభివృద్ధి చేసింది. పేద, మధ్య ఆదాయ దేశాలకు తక్కువ ధరలో అందుబాటులో ఉండే విధంగా దీన్ని రూపొందించారు. క్లినికల్‌ ట్రయల్స్‌లో భాగంగా దీనిని మూడు దశల్లో పరీక్షించగా మెరుగైన ఫలితాలు వచ్చాయి. దీంతో డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా(డీసీజీఐ) ఇటీవలే అత్యవసర వినియోగ అనుమతి ఇచ్చింది.

ప్రస్తుత అనుమతి ప్రకారం.. ఇప్పటికే రెండు డోసుల కొవాగ్జిన్‌ /కొవిషీల్డ్‌ టీకా తీసుకున్న వారు.. 6 నెలల తర్వాత బూస్టర్‌ డోసుగా ఈ చుక్కల మందు టీకా తీసుకోవచ్చు. మనదేశంలో 18 ఏళ్ల వయసు దాటిన వారు ఈ టీకా వినియోగించేందుకు డీసీజీఐ అనుమతి ఇచ్చింది.


Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు