భారత్‌ బయోటెక్ నుంచి మరో టీకా!

భారత ఔషధ నియంత్రణ సంస్థ నుంచి కొవాగ్జిన్ కరోనా టీకాకు అనుమతులు పొందిన భారత్‌ బయోటెక్..ప్రస్తుతం ముక్కు ద్వారా ఇచ్చే టీకా తయారీపై దృష్టి సారించింది.

Updated : 08 Jan 2021 14:55 IST

హైదరాబాద్‌: భారత ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఐ) నుంచి కొవాగ్జిన్ కరోనా టీకాకు అనుమతులు పొందిన స్వదేశీ ఔషధ రంగ దిగ్గజం భారత్‌ బయోటెక్..ప్రస్తుతం ముక్కు ద్వారా ఇచ్చే టీకా తయారీపై దృష్టి సారించింది. దానికి సంబంధించి ఈ ఏడాది ఫిబ్రవరి-మార్చిలో ఫేజ్-1 క్లినికల్ ప్రయోగాలు ప్రారంభమవుతాయని వెల్లడించింది. ఈ టీకా అభివృద్దికి సెయింట్‌ లూయిస్‌లోని వాషింగ్టన్‌ యూనివర్సిటీ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపింది. ముక్కు ద్వారా ఒక్క డోసులోనే కరోనా టీకాను అందించే విధంగా దీన్ని సిద్ధం చేస్తున్నట్లు తెలిపింది. 

‘ముక్కు ద్వారా అందించే టీకా (BBV154) వల్ల ఎదురయ్యే దుష్ర్పభావాలు, రోగ నిరోధకత, సవాళ్లను గుర్తించేందుకు భారత్‌, యూఎస్‌లో నిర్వహించిన ప్రీ క్లినికల్ ప్రయోగాలు విజయవంతమయ్యాయి. మొదటి దశ మానవ ప్రయోగాలు 2021 ఫిబ్రవరి-మార్చిలో మనదేశంలో ప్రారంభం కానున్నాయి’ అని భారత్ బయోటెక్ వెల్లడించింది. ముక్కు ద్వారా అందించే టీకా అభివృద్ధిపై ఇటీవల బయోటెక్ సీఎండీ కృష్ణ ఎల్ల మాట్లాడారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న టీకాలన్నీ రెండు మోతాదుల్లో అందించాల్సి ఉంటుందని, అందుకోసం 2.6 బిలియన్ల సిరంజీలు వాడాల్సి ఉంటుందని ఆయన వెల్లడించారు. అవి కాలుష్యానికి కారణమవుతాయన్నారు. తమ టీకా భారత్‌ తలపెట్టిన భారీ టీకా కార్యక్రమ వ్యయంపై గణనీయమైన ప్రభావం చూపుతుందని తెలిపారు. 

ఇవీ చదవండి:

కరోనా అని..విమానం అంతా బుక్ చేసుకొని

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని