Hathras stampede: హాథ్రస్ తొక్కిసలాట.. తొలిసారి మీడియా ముందుకు భోలేబాబా

Hathras stampede: కొద్దిరోజుల క్రితం హాథ్రస్‌లో జరిగిన సత్సంగ్‌ తీవ్ర విషాదం నింపింది. దీనిపై తాజాగా ‘భోలేబాబా’(Bhole Baba) మీడియాతో మాట్లాడారు. 

Updated : 06 Jul 2024 19:08 IST

దిల్లీ: ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగిన హాథ్రస్‌ తొక్కిసలాట (Hathras stampede) ఘటన యావత్‌ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన సంగతి తెలిసిందే. దాంతో ‘భోలే బాబా’(Bhole Baba) పేరు దేశమంతా మారుమోగిపోయింది. ఈ నేపథ్యంలో ఆయన తొలిసారి మీడియా ముందుకు వచ్చారు. ఆ దుర్ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

‘‘జులై 2 ఘటనతో మేం చాలా వేదనకు గురయ్యాం. ఈ క్లిష్ట సమయంలో ఆ భగవంతుడు బాధను భరించే శక్తిని ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను. తొక్కిసలాటకు బాధ్యులైన వారు శిక్ష నుంచి తప్పించుకోలేరని నేను నమ్ముతున్నాను. నాకు ప్రభుత్వంపై విశ్వాసం ఉంది. మృతులు, గాయపడిన కుటుంబాలకు అండగా ఉండాలని కమిటీ సభ్యులకు సూచించాను’’ అని మీడియా ముందు మాట్లాడారు.

అలీగఢ్‌తోపాటు హాథ్రస్‌ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ప్రతి మంగళవారం సత్సంగ్‌ పేరుతో బాబా ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపడుతుంటారు. వేల సంఖ్యలో భక్తులు హాజరవుతుంటారు. కొన్నిసార్లు లక్షల్లో జనం వస్తుంటారు. జులై 2న హాథ్రస్‌లో నిర్వహించిన సత్సంగ్‌కు 80వేల మందికి ఏర్పాట్లు చేయగా.. రెండున్నర లక్షలమంది హాజరయ్యారు. ‘సేవాదర్‌ ఆర్మీ’గా పిలిచే బృందం ఈ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇక ఆ రోజు ముఖ్యసేవాదర్‌గా ఉన్న దేవ్‌ప్రకాశ్‌ మధుకర్‌ శుక్రవారం రాత్రి దిల్లీలో పోలీసుల ముందు లొంగిపోయాడు. పోలీసులు నమోదుచేసిన ఎఫ్‌ఐఆర్‌లో అతడే ప్రధాన నిందితుడిగా ఉన్నాడు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని