ఇక ఆ దేశంలోనూ యూపీఐ క్యూఆర్‌ కోడ్‌ సేవలు

 భారత్‌లో 10కోట్ల పైగా యూపీ క్యూఆర్‌ కోడ్‌ ప్రారంభం

Published : 13 Jul 2021 23:45 IST

 భారత్ నుంచి స్ఫూర్తి పొంది ఆచరణలోకి

దిల్లీ: మహమ్మారి కరోనా విజృంభణ తర్వాత ఆన్‌లైన్‌ లావాదీవీలు ఊపందుకున్నాయి. కరెన్సీ ద్వారా వైరస్‌ ముప్పు ఉందని హెచ్చరికలు వచ్చిన నేపథ్యంలో భారత్‌ ఇంటర్‌ఫేస్‌ ఫర్‌ మనీ యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్ (బీహెచ్‌ఐఎం- యూపీఐ) క్విక్‌ రెస్పాన్స్‌ కోడ్‌ (క్యూ ఆర్‌ కోడ్‌) ద్వారా నగదు లావాదేవీలు జరగడం చూస్తూనే ఉన్నాం. బ్యాంక్‌ ఖాతాలు మొబైల్‌కు అనుసంధానం చేసి నగదు బదిలీ చేసే వెసులు బాటు కల్పించడమే దీని ప్రత్యేకత. తాజాగా ఇదే పద్ధతిని అనుసరించేందుకు ముందుకొచ్చింది భూటాన్‌ దేశం. భారత్‌ నుంచి యూపీఐ పద్ధతిని అనుసరించబోయే తొలిదేశంగా భూటన్‌ నిలిచింది. మంగళవారం నిర్వహించిన వర్చువల్‌ సమావేశంలో బీహెచ్‌ఐఎం-యూపీఐని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌, భూటాన్‌ మంత్రి లియోన్పో నామ్‌గే సంయుక్తంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్‌ బీహెచ్‌ఎంఐ యూపీఐ వినియోగించి అక్కడ ప్రసిద్ధి చెందిన ఓజీఓపీ ఔట్‌లెట్‌లో ఒక సేంద్రియ ఉత్పత్తిని కొనుగోలు చేశారు. దీని ద్వారా ఇరు దేశాల మధ్య వ్యాపారం, వాణిజ్యం అలాగే పర్యాటక సంబంధాలు బలపడతాయని ఇరు దేశ ఆర్థిక మంత్రిత్వ శాఖలు విశ్వాసం వ్యక్తం చేశాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని