Modi: ప్రధాని మోదీకి భూటాన్‌ అత్యున్నత పౌర పురస్కారం

భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీకి మరో అరుదైన గౌరవం లభించింది. ప్రధాని మోదీని పొరుగు దేశం భూటాన్‌ తమ దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘నాడగ్‌

Updated : 17 Dec 2021 15:02 IST

థింపు: భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీకి మరో అరుదైన గౌరవం లభించింది. ప్రధాని మోదీని పొరుగు దేశం భూటాన్‌ తమ దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘నాడగ్‌ పెల్‌ గి ఖోర్లో(Ngadag Pel gi Khorlo )’తో సత్కరించింది. భూటాన్‌ నేషనల్‌ డేను పురస్కరించుకుని ఈ అవార్డును ప్రకటించింది.

ఈ విషయాన్ని ఆ దేశ ప్రధానమంత్రి లొటయ్‌ షెరింగ్‌ ట్విటర్‌ వేదికగా వెల్లడిస్తూ ప్రధాని మోదీకి శుభాకాంక్షలు తెలిపారు. ‘‘భూటాన్‌ రాజు ఆదేశాల మేరకు భారత ప్రధాని నరేంద్రమోదీకి దేశ అత్యున్నత పౌర పురస్కారాన్ని ప్రకటిస్తున్నాం. గత కొన్నేళ్లుగా ఆయన అందిస్తున్న స్నేహపూర్వక సహకారం, ముఖ్యంగా కొవిడ్‌ సమయంలో మోదీ అందించిన మద్దతుకు గుర్తింపుగా ఈ అవార్డును అందిస్తున్నాం. భూటాన్‌ ప్రజల తరఫున మీకు(మోదీకి) శుభాకాంక్షలు. ఈ పురస్కారానికి మీరు ఎంతగానో అర్హులు. ఈ అవార్డు అందుకునేందుకు మీ రాక కోసం ఎదురుచూస్తున్నాం’’ అని భూటాన్‌ ప్రధాని కార్యాలయం నేడు ప్రకటన విడుదల చేసింది.

కాగా.. ఇప్పటికే సౌదీ అరేబియా, అఫ్గానిస్థాన్‌ దేశాలు ప్రధాని మోదీని తమ దేశ అత్యున్నత పౌర పురస్కారాలతో సత్కరించాయి. అమెరికా సైన్యం అందించే అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన ‘లెజియన్‌ ఆఫ్‌ మెరిట్‌’ను మోదీకి అప్పటి దేశాధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ బహూకరించిన విషయం తెలిసిందే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని