అమెరికాలో అందరికీ వ్యాక్సిన్: బైడెన్‌

కరోనా తమ ప్రజలకు త్వరలోనే రక్షణ కల్పించలగలమని అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ విశ్వాసం వ్యక్తం చేశారు.

Published : 17 Feb 2021 16:53 IST

వాషింగ్టన్‌: కరోనా మహమ్మారి నుంచి తమ దేశ ప్రజలకు త్వరలోనే రక్షణ కల్పించగలమని అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ విశ్వాసం వ్యక్తం చేశారు. జులై నెలాఖరులోగా దేశంలో 600 మిలియన్‌ డోసుల కొవిడ్‌ టీకా అందుబాటులోకి రానుందని ఆయన తెలిపారు. మోడెర్నా, ఫైజర్‌ ఫార్మా సంస్థలు చెరో 300 మిలియన్‌ డోసుల కొవిడ్‌ టీకాను సరఫరా చేస్తాయని ఆయన తెలిపారు.  ప్రతి ఒక్క అమెరికన్‌కూ టీకా అందజేసేందుకు ఇవి సరిపోతాయని ఆయన వివరించారు.

అంతేకాకుండా తమ విద్యార్థులు పాఠశాలలకు, విద్యా సంస్థలకు వెళ్లాలని తాను ఆశిస్తున్నట్టు ఆయన తెలిపారు. అందుకుగాను ఉపాధ్యాయులకు వీలైనంత త్వరగా వ్యాక్సిన్లు అందజేయటాన్ని తాను సమర్థిస్తున్నాన్నారు. టీకా పంపిణీలో అధికారులు వారికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.

దేశంలో పరిస్థితులు ఎప్పుడు సాధారణ స్థితికి చేరుకుంటాయనే ప్రశ్నకు జవాబుగా.. రానున్న క్రిస్మస్‌ కల్లా పరిస్థితి మారుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మాస్కు ధరించి, సామాజిక దూరం పాటించాల్సిన అవసరం అప్పటికీ చాలా తక్కువ మందికి ఉండొచ్చని ఆయన అంచనా వేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని