Siddaramaiah:: కన్నడ రాజకీయాల్లో ‘ముడా’ కలకలం..చిక్కుల్లో సీఎం సతీమణి

కన్నడ రాజకీయాల్లో ముడా స్కాం కలకలం సృష్టిస్తోంది. కాగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సతీమణికి ఇందులో భాగం ఉందంటూ పోలీసులకు ఫిర్యాదు అందింది.   

Published : 10 Jul 2024 16:26 IST

బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సతీమణి పార్వతిపై ఓ సామాజిక కార్యకర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. మైసూరు నగరాభివృద్ధి ప్రాధికార (ముడా) కుంభకోణంలో పార్వతితో పాటు మరో ఇద్దరికి ప్రమేయం ఉందని ఆరోపిస్తూ ఓ సామాజిక కార్యకర్త స్నేహమయి కృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సిద్ధరామయ్య, అతడి సతీమణి, ఇతర అధికారులు అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ముడా అవకతవకలపై ఇప్పటికే దర్యాప్తు కొనసాగుతుండటంతో పోలీసులు మళ్లీ ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదు.

ముడా భూకేటాయింపుల్లో జరిగిన అవకతవకల్లో పార్వతి హస్తం ఉందని భాజపా నేత చేసిన ఆరోపణల నేపథ్యంలో తాజా ఫిర్యాదు ప్రాముఖ్యత సంతరించుకుంది.  అందుకు ప్రధాన కారణం ముఖ్యమంత్రి సతీమణి పార్వతి పేరిట పంపిణీ చేసిన ప్రత్యామ్నాయ స్థలాల విలువ అసలు భూముల విలువ కంటే ఎక్కువగా ఉందన్న కారణమే. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈ ఆరోపణను ఖండించారు. 1998లో పార్వతి సోదరుడు మల్లికార్జున ఆమెకు ఆ భూమిని ఇచ్చారని సిద్ధరామయ్య చెప్పే మాటలు నిజం కావని, దానిని ఆమె సోదరుడు 2004లో  కొనుగోలు చేసి 2010లో పార్వతికి బహుమతిగా ఇచ్చారని కార్యకర్త ఆరోపించారు. దానిని వ్యవసాయ భూమి అని తప్పుడు రికార్డులు సృష్టించారని ఆరోపించారు. 

ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాత్రమే కాదు ముడా పరిధిలో రూ.4 వేల కోట్ల విలువైన అక్రమాలు చోటు చేసుకున్నాయని ప్రతిపక్ష నేత ఆర్‌.అశోక్‌ ఆరోపించారు. ఇందులో జరిగిన అక్రమాల నిగ్గు తేలాలంటే సీబీఐతో విచారణ జరిపించాలని భాజపా డిమాండ్‌ చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని