బర్త్ డే రోజునే వ్యాక్సిన్‌ తీసుకున్న సీఎం..

దేశంలో రెండో దశ వ్యాక్సిన్‌ పంపిణీ కార్యక్రమంలో భాగంగా 60 ఏళ్లు దాటిన వారికి సోమవారం నుంచి టీకా అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో మార్చి 1తో 70 వసంతాలు పూర్తి చేసుకున్న బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ పాట్నాలో ఫస్ట్‌ డోస్‌ వ్యాక్సిన్‌ తీసుకున్నారు. ఈ మేరకు పుట్టిన రోజునే టీకా తీసుకోవడం ఆనందంగా ఉందని ఆయన  తెలిపారు. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ట్విటర్‌ ద్వారా నితీశ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

Published : 01 Mar 2021 23:03 IST

 ప్రధాని మోదీ అభినందన..

పాట్నా: దేశంలో రెండో దశ వ్యాక్సిన్‌ పంపిణీ కార్యక్రమంలో భాగంగా 60 ఏళ్లు దాటిన వారికి సోమవారం నుంచి టీకా అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో మార్చి 1తో 70 వసంతాలు పూర్తి చేసుకున్న బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ పాట్నాలో ఫస్ట్‌ డోస్‌ వ్యాక్సిన్‌ తీసుకున్నారు. ఈ మేరకు పుట్టిన రోజునే టీకా తీసుకోవడం ఆనందంగా ఉందని ఆయన  తెలిపారు. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ట్విటర్‌ ద్వారా నితీశ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ‘ బిహార్‌ మఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు,  ఆయన నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోంది. ఆయన ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నా’ అని మోదీ ట్వీట్‌ చేశారు.
రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌ విజయ్‌ కుమార్‌ సిన్హా, ప్రముఖ నాయకులు ట్విటర్ ద్వారా బిహార్‌ సీఎంకు పుట్టిన శుభాకాంక్షలు తెలిపారు.  కాగా రాష్ట్రంలోని ప్రైవేటు ఆసుపత్రుల్లో కూడా వ్యాక్సిన్‌ ఉచితంగా పొందవచ్చునని టీకా తీసుకున్న అనంతరం నితీశ్‌ కుమార్‌ ప్రకటించారు. ప్రధాని మోదీ దిల్లీలోని ఎయిమ్స్‌ ఆసుపత్రిలో సోమవారం కొవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకున్నారు. సోమవారం తొలి డోసు పొందినట్లు ఆయన ట్విటర్‌ ద్వారా ప్రకటించారు. కొవిడ్‌కు వ్యతిరేకంగా దేశ వైద్యులు చేస్తున్న కృషిని వ్యాక్సిన్‌ తీసుకున్న సందర్భంగా మోదీ కొనియాడారు.   

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని