Coronaతో బిహార్‌ సీఎస్‌ కన్నుమూత 

కరోనా బారిన పడి సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి, బిహార్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) అరుణ్‌కుమార్‌ సింగ్‌ కన్నుమూశారు.....

Updated : 30 Apr 2021 15:52 IST

పట్నా: కరోనా బారిన పడి సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి, బిహార్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) అరుణ్‌కుమార్‌ సింగ్‌ కన్నుమూశారు. ఇటీవల కరోనా సోకడంతో ఓ ఆస్పత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ శుక్రవారం ప్రాణాలు విడిచారు. 1985 బ్యాచ్‌కు చెందిన ఆయన బిహార్‌ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి. జేడీయూ అధినేత నీతీశ్‌ కుమార్‌ నేతృత్వంలో బిహార్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ఆయన సీఎస్‌గా నియమితులయ్యారు. గతంలో పలు హోదాల్లో పనిచేశారు. 

సీఎం నీతీశ్‌ దిగ్భ్రాంతి

అరుణ్‌కుమార్‌ సింగ్‌ మరణంపై బిహార్‌ సీఎం నీతీశ్‌ కుమార్‌ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. కరోనా సోకి మరణించడంపై ఆవేదన వ్యక్తంచేశారు. ఈ మేరకు నీతీశ్‌ ట్వీట్‌ చేశారు. గొప్ప స్నేహశీలి అని, పలు హోదాల్లో విశేష సేవలందించారంటూ కొనియాడారు. ఆయన మరణం పరిపాలనా రంగానికి తీరని లోటన్నారు. అరుణ్‌కుమార్‌ సింగ్‌ అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించనున్నట్టు సీఎం వెల్లడించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని