బిహార్‌: 3గంటలకు 42.08% పోలింగ్‌

బిహార్‌లో మూడో దశ శాసనసభ ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. కరోనా నిబంధనలు పాటిస్తూ ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. శనివారం మధ్యాహ్నం 3గంటల సమాయానికి 42.08శాతం పోలింగ్‌ నమోదైంది.

Published : 07 Nov 2020 15:44 IST

పట్నా: బిహార్‌లో మూడో దశ శాసనసభ ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. కరోనా నిబంధనలు పాటిస్తూ ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. శనివారం మధ్యాహ్నం 3గంటల సమాయానికి 42.08శాతం పోలింగ్‌ నమోదైంది. ఈ మేరకు ఎన్నికల సంఘం ప్రకటించింది. జిల్లాల వారీగా చూసుకుంటే ఇప్పటివరకు సహస్ర జిల్లాలో అత్యధికంగా 48.98శాతం ఓటింగ్‌ జరగ్గా.. అత్యల్పంగా మధుబని జిల్లాలో 36.23శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఈసీ పేర్కొంది. కాగా బిహార్‌ ఎన్నికల్లో తొలి రెండు దశలతో పోలిస్తే మూడో దశలో(ప్రస్తుత సమయానికి)ఓటింగ్‌ శాతం కాస్త ఎక్కువే నమోదవుతున్నట్లు ఈసీ వెల్లడించింది.

బెగుసరాయ్‌ నియోజకవర్గంలో ప్రజలు పోలింగ్‌ను బహిష్కరించారు. ఎన్డీయే హయాంలో తమ ప్రాంతంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని పేర్కొంటూ ఎవరూ ఓటింగ్‌లో పాల్గొనడానికి నిరాకరిస్తుండటంతో పోలింగ్‌ కేంద్రాలు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయని మీడియా వర్గాలు పేర్కొన్నాయి. 

బిహార్‌లో జరుగుతున్న ఎన్నికల్లో తొలి దశలో 55.69శాతం, రెండో దశలో 53.51శాతం పోలింగ్‌ నమోదైంది. శనివారం మూడో దశలో భాగంగా 16జిల్లాల్లోని 78శాసనసభ స్థానాలకు ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఇందుకోసం ఈసీ కరోనా వ్యాప్తి జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని