Khakee: రూ.1కే ఒప్పందం.. భార్య ఖాతాలోకి రూ.49 లక్షలు..

‘ఖాకీ: ది బిహార్‌ చాప్టర్‌’ అనే వెబ్‌సిరీస్‌తో బాగా పేరు సంపాదించుకున్న బిహార్‌ ఐపీఎస్‌ అధికారి అమిత్‌ లోఢా అవినీతి ఆరోపణల్లో చిక్కుకున్నారు.

Updated : 10 Dec 2022 11:00 IST

బిహార్‌ ‘ఖాకీ’ ఐపీఎస్‌ అవినీతి  

పట్నా: ‘ఖాకీ: ది బిహార్‌ చాప్టర్‌’ అనే వెబ్‌సిరీస్‌తో బాగా పేరు సంపాదించుకున్న బిహార్‌ ఐపీఎస్‌ అధికారి అమిత్‌ లోఢా అవినీతి ఆరోపణల్లో చిక్కుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగాన్ని వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాడుకున్నారంటూ ఆయనపై అభియోగాలు నమోదయ్యాయి. ఓ మోస్ట్‌వాంటెడ్‌ క్రిమినల్‌ను తాను అరెస్టు చేసిన తీరుపై లోఢా ‘బిహార్‌ డైరీస్‌’ అనే పుస్తకాన్ని రాశారు. దాని ఆధారంగా వెబ్‌సిరీస్‌ను రూపొందించేందుకు ఆయన ఓ ప్రముఖ నిర్మాణ సంస్థతో రూ.1కే అధికారికంగా ఒప్పందం చేసుకున్నారు. అయితే అంతకంటే ముందే- వెబ్‌సిరీస్‌కు సంబంధించి ఆయన భార్య ఖాతాలో రూ.49 లక్షలు జమ అయినట్లు పోలీసులు తాజాగా గుర్తించారు. లోఢాపై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదుచేశారు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు