National News: కొండ మీద గుడి.. 390 మెట్లు చెక్కిన అ‘సామాన్యుడు’

భక్తుల కష్టాలను చూడలేక 1500 అడుగుల ఎత్తులో ఓ కొండపై ఉన్న ఆలయానికి 390 మెట్లు చెక్కి పలువురితో ప్రశంసలు అందుకుంటున్నాడు బిహార్‌కు చెందిన ఓ సామాన్య వ్యక్తి గనౌరి పాశ్వాన్‌.

Updated : 03 Dec 2022 13:31 IST

భక్తుల కష్టాలను చూడలేక 1500 అడుగుల ఎత్తులో ఓ కొండపై ఉన్న ఆలయానికి 390 మెట్లు చెక్కి పలువురితో ప్రశంసలు అందుకుంటున్నాడు బిహార్‌కు చెందిన ఓ సామాన్య వ్యక్తి గనౌరి పాశ్వాన్‌. జహనాబాద్‌ జిల్లా కేంద్రానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న బన్వారియా గ్రామంలో.. ఓ కొండపై యోగేశ్వర్‌నాథ్‌ ఆలయం ఉంది. దానికి చేరడానికి భక్తులకు, ముఖ్యంగా మహిళలకు చాలా కష్టంగా ఉండేది. దీంతో వారు ఆలయానికి సులువుగా చేరేలా ఓ మార్గం నిర్మించాలనుకున్నాడు పాశ్వాన్‌. అలా 2014లో పని మొదలు పెట్టి దాదాపు 390 మెట్లు చెక్కాడు. తన గమ్యానికి మరో 10 మెట్ల దూరంలో ఉన్నాడు. యోగేశ్వర్‌నాథ్‌ ఆలయం పర్యాటక ప్రాంతంగా గుర్తింపు పొందాలనేది తన కోరికగా పేర్కొంటున్నారు పాశ్వాన్‌.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు