
కొవిడ్ తదనంతర సమస్యలతో మంత్రి మృతి!
పట్నా: కొవిడ్-19 తదనంతర సమస్యలతో బాధపడుతూ బిహార్ బీసీశాఖ మంత్రి వినోద్ కుమార్ సింగ్ మరణించారు. ఇటీవల మెదడు సంబంధిత సమస్యలతో ఆస్పత్రిలో చేరిన వినోద్.. చికిత్స పొందుతూ సోమవారం మరణించారని కుటుంబసభ్యులు తెలిపారు. వారు తెలిపిన ప్రకారం.. గత జూన్ 28న వినోద్ కొవిడ్ బారిన పడ్డారు. కొవిడ్ నుంచి కోలుకున్న కొద్ది రోజులకు ఆయనకు మెదడులో రక్త స్రావం సమస్యలు తలెత్తడంతో కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో ఆయన చికిత్స పొందుతూ సోమవారం మరణించినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. వినోద్ కుమార్ కతిహార్ జిల్లాలోని ప్రాన్పూర్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఆయనకు భార్య నిషా, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
కాగా ఆయన మృతిపై బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ సంతాపం వ్యక్తం చేశారు. ‘వినోద్ కుమార్ సమర్థవంతమైన నాయకుడు. ఆయన మరణించడం వ్యక్తిగతంగా నన్ను ఎంతో బాధిస్తోంది. వినోద్ మృతి రాష్ట్ర రాజకీయాలకు తీరని లోటు. ఆయన అంత్యక్రియల్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుంది’ అని ప్రకటించారు. కాగా భాజపా వినోద్ భార్య నిషాసింగ్‌ను ప్రాన్పూర్ తరపున బరిలో దింపాలని యోచిస్తోంది. ప్రాన్పూర్‌కు మూడో విడతలో నవంబర్ 7న ఎన్నిక జరగనుంది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Mumbai Rains: జలమయమైన ముంబయి.. మరోసారి భారీ వర్ష సూచన
-
India News
Lalu Prasad Yadav: ‘నాన్న మీరే నా హీరో’ : ఆస్పత్రిలో లాలూ.. భావోద్వేగ పోస్టు పెట్టిన కుమార్తె..!
-
Business News
Health Insurance: హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం తగ్గించుకోండిలా..
-
Movies News
Pawan Kalyan: ఆయన సినిమా రివ్యూలు ఎంతో ఆసక్తిని రేకెత్తించేవి: పవన్‌కల్యాణ్
-
India News
Modi: ఆ చిన్నారిని కలిశాక.. నాలో విశ్వాసం పెరిగింది: మోదీ
-
World News
USA Mass Shooting: తుపాకీ నీడన అమెరికా.. అత్యాధునిక ఆయుధంతో 22ఏళ్ల యువకుడి కాల్పులు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Upasana: ‘ఉపాసన.. పిల్లలెప్పుడు’.. అని అడుగుతున్నారు.. సద్గురు సమాధానం
- IND vs ENG : మొత్తం మారిపోయింది
- Raghurama: రఘురామ ఇంట్లోకి ప్రవేశించే యత్నంలో దొరికిపోయిన ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్!
- Vishal: ఫైట్ సీన్స్ చేస్తుండగా కుప్పకూలిన హీరో విశాల్
- Double BedRooms: అమ్మకానికి.. రెండు పడక గదుల ఇళ్లు!
- Emirates: గాల్లో విమానానికి రంధ్రం.. అలాగే 14 గంటల ప్రయాణం!
- Hyderabad News: సాఫ్ట్వేర్ ఇంజినీర్ హత్యకు రూ.4.50 లక్షల సుపారీ!
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (05/07/22)
- Hyderabad News: రోజూ ‘బయోమెట్రిక్’ వేసి వెళ్తే నెలకు రూ. 15 వేలు!
- Viral video: రియల్ హీరో.. కరెంటు షాక్‌తో విలవిల్లాడుతున్న ఆవును రక్షించిన యువకుడు