Bihar: అసెంబ్లీ ప్రాంగణంలో కాన్వాయ్‌ అడ్డగింత.. ఆగ్రహంతో మంత్రి చిందులు!

జిల్లా మేజిస్ట్రేట్‌, ఎస్పీ ప్రయాణిస్తున్న కార్లు వెళ్లేందుకుగానూ.. తన కాన్వాయ్‌ను అడ్డుకోవడంపై బిహార్‌కు చెందిన ఓ మంత్రి ఆగ్రహోదుక్తుడయ్యారు. తనను ఆపిన సంబంధిత అధికారులను సస్పెండ్‌ చేసేవరకు అసెంబ్లీకి రానని భీష్మించుకు కూర్చున్నారు. ఆయనే రాష్ట్ర కార్మిక...

Published : 03 Dec 2021 01:29 IST

పట్నా: జిల్లా మేజిస్ట్రేట్‌, ఎస్పీ ప్రయాణిస్తున్న వాహనాలు వెళ్లేందుకుగానూ.. తన కాన్వాయ్‌ను అడ్డుకోవడంపై బిహార్‌కు చెందిన ఓ మంత్రి ఆగ్రహం వ్యక్తంచేశారు. తనను ఆపిన సంబంధిత అధికారులను సస్పెండ్‌ చేసేవరకు అసెంబ్లీకి రానని భీష్మించుకు కూర్చున్నారు. ఆయనే రాష్ట్ర కార్మిక, సమాచార సాంకేతిక శాఖల మంత్రి జీవేష్ మిశ్రా. అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేందుకుగానూ గురువారం కాన్వాయ్‌గా బయల్దేరారు.

అసెంబ్లీ ప్రాంగణంలోకి రాగానే.. పట్నా జిల్లా మేజిస్ట్రేట్‌, ఎస్పీ ప్రయాణిస్తున్న వాహనాలు వెళ్లేందుకుగానూ మంత్రి కాన్వాయ్‌ను నిలిపేశారు. దీంతో ఆయన అక్కడ విధుల్లో ఉన్న సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఇక్కడి ప్రభుత్వమే మేం.. మాతోనే తప్పుగా వ్యవహరిస్తారా’ అంటూ అగ్గిమీద గుగ్గిలమయ్యారు. తాను వేచి ఉండటానికి కారణమైన అధికారులను సస్పెండ్ చేసే వరకు అసెంబ్లీలో అడుగుపెట్టబోనని స్పష్టం చేయడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని