Bilkis Bano: ఇలాగైతే.. ప్రతి అత్యాచార దోషి విడుదల కోరుకుంటారు!
బిల్కిస్ బానో (Bilkis Bano) సామూహిక అత్యాచార కేసులో జీవితఖైదు అనుభవిస్తున్న దోషులను జైలు నుంచి విడుదల చేస్తూ గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని బాధితురాలి తరపు న్యాయవాది శోభా గుప్తా తీవ్రంగా తప్పుపట్టారు.
గుజరాత్ ప్రభుత్వ తీరును తప్పుపట్టిన బిల్కిస్ బానో తరపు న్యాయవాది
ముంబయి: బిల్కిస్ బానో (Bilkis Bano) సామూహిక అత్యాచార కేసులో జీవితఖైదు అనుభవిస్తున్న దోషులను జైలు నుంచి విడుదల చేస్తూ గుజరాత్ ప్రభుత్వం (Gujarat Govt) తీసుకొన్న నిర్ణయంపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసులో 11 మంది దోషులను విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని బాధితురాలి న్యాయవాది శోభా గుప్తా తీవ్రంగా తప్పుపట్టారు. ఇది చూసి ప్రతి అత్యాచార, హత్య దోషి కూడా ఉపశమనం (Remission policy) కోసం దరఖాస్తు చేసుకుంటారని అన్నారు.
‘గుజరాత్ ప్రభుత్వ నిర్ణయాన్ని చూసి.. 14 ఏళ్ల శిక్ష పూర్తి చేసుకున్న దోషులు విడుదలకు దరఖాస్తు చేసుకుంటారు. ఇటువంటి తీవ్రమైన కేసులోనే దోషులను విడుదల చేస్తే.. ఇక ప్రతి అత్యాచార, హత్య కేసులో దోషులు విడుదల కోసం విజ్ఞప్తి చేయకుండా ఎలా ఉంటారు..? అని అత్యాచార బాధితురాలి తరపు న్యాయవాది శోభా గుప్తా ఆందోళన వ్యక్తం చేశారు. దోషుల విడుదల అనేది చట్టంలో ఉండటమే తప్పని.. అది హక్కు కాదన్నారు. ‘1992 విడుదల విధానం’ ప్రకారం దోషులను విడుదల చేశామని ప్రభుత్వం సమర్థించుకోవడాన్ని తప్పుపట్టిన ఆమె.. ఇప్పుడది ఉనికిలోనే లేదన్నారు.
ఇదిలాఉంటే, 2002 నాటి గోద్రా (గుజరాత్) అల్లర్లకు సంబంధించిన సామూహిక అత్యాచార కేసులో 11 మంది దోషులను స్వాతంత్ర్య దినోత్సవం నాడు ఆ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. దీనిపై విపక్ష కాంగ్రెస్‌తో పాటు బాధిత కుటుంబాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. దోషులు విడుదలయ్యారనే విషయం నాలో ప్రశాంతతను దూరం చేసిందని బాధితురాలు బిల్కిస్ బానో కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని గుజరాత్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Lalu Prasad Yadav: రాజకీయాల్లోకి లాలూ మరో కుమార్తె..?
రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తన కుమార్తె రోహిణి ఆచార్యను ఆర్జీడీ కంచుకోట అయిన సరన్ నుంచి ఎన్నికల బరిలోకి దింపాలని యోచిస్తున్నట్లు పార్టీ సన్నిహిత వర్గాలు తెలియజేస్తున్నాయి. -
Rahul Gandhi: నా వ్యాఖ్యలను వక్రీకరించారు : రాహుల్
తాను చేసిన వ్యాఖ్యలను ప్రధాని మోదీ వక్రీకరించారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) పేర్కొన్నారు. -
Chennai Super Kings: అన్నాడీఎంకేకు 80% విరాళాలు.. సీఎస్కే యాజమాన్యం నుంచే
Chennai Super Kings: ఐపీఎల్ ఫ్రాంచైజీల్లో ఒకటైన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు యాజమాన్యం ఎన్నికల బాండ్ల రూపంలో అన్నాడీఎంకేకు భారీగా విరాళం ఇచ్చినట్లు తెలిసింది. -
Sadananda: కాంగ్రెస్‌లోకి సదానంద గౌడ..? మనసులో మాట చెబుతానన్న మాజీ సీఎం
తన భవిష్యత్ కార్యాచరణను త్వరలో ప్రకటిస్తానని భాజపా సీనియర్ నేత సదానంద గౌడ(Sadananda) అన్నారు. -
Sanjay Singh: ‘ప్రమాణ స్వీకారానికి జైలు నుంచి పార్లమెంటుకు తీసుకెళ్లండి’ - దిల్లీ కోర్టు
రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన సంజయ్ సింగ్ ప్రమాణస్వీకారం కోసం మార్చి 19న తిహాడ్ జైలు నుంచి పార్లమెంటుకు తీసుకెళ్లాలని దిల్లీ కోర్టు ఆదేశించింది. -
సంక్షోభం వేళ నీటి ఆదాకు బెంగళూరు డాక్టర్ ‘4 టిప్స్’.. రోజుకు 600 లీటర్లు సేవ్ చేశారట..!
Bengaluru Water Crisis: బెంగళూరుకు చెందిన ఓ డాక్టర్ కొన్ని టిప్స్‌తో రోజుకు 600 లీటర్లు నీటిని ఆదా చేశారట. వాటిని ఆమె వివరించగా.. అవి నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరి ఆ టిప్స్ ఏంటో మీరే చూడండి..! -
Himachal Pradesh: కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేల అనర్హతపై స్టేకు సుప్రీం నిరాకరణ
రాజ్యసభ ఎన్నికల్లో పార్టీ విప్ ధిక్కరించి క్రాస్ ఓటింగ్‌కి పాల్పడిన ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేల అనర్హతపై స్టే విధించేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. -
Google: చిన్నప్పటి ఫొటోతో గూగుల్ అకౌంట్ బ్లాక్.. హైకోర్టు నోటీసులు
Google account: చిన్నప్పటి ఫొటోను అప్లోడ్ చేసిన కారణంగా గూగుల్ ఓ వ్యక్తి అకౌంట్‌ను బ్లాక్ చేసింది. దీనిపై అతడు గుజరాత్ హైకోర్టును ఆశ్రయించాడు. -
ECI: బెంగాల్ డీజీపీ సహా 6 రాష్ట్రాల హోంశాఖ కార్యదర్శులపై ‘ఈసీ’ వేటు
ఆయా రాష్ట్రాల ఉన్నతాధికారులపై ఎన్నికల సంఘం కొరడా ఝళిపించింది. గుజరాత్, ఉత్తర్‌ప్రదేశ్, బిహార్, ఝార్ఖండ్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్‌ల హోంశాఖ కార్యదర్శులను తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. -
‘నేను సోనియాగాంధీతో భేటీ కాలేదు.. అది రాహుల్ పొలిటికల్ స్టంట్’: అశోక్ చవాన్
ఇటీవల కాంగ్రెస్(Congress)ను వీడిన సీనియర్ నేతలను ఉద్దేశించి ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేసిన వ్యాఖ్యలపై మాజీ సీఎం అశోక్ చవాన్ స్పందించారు. -
Satyendar Jain: ఆప్‌నేత సత్యేందర్ జైన్‌కు సుప్రీంలో చుక్కెదురు
మనీలాండరింగ్ కేసులో ఆప్ నేత సత్యేందర్ జైన్ బెయిల్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం కొట్టేసింది. -
ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ వద్దే చోరీ.. తర్వాత సీన్ రివర్స్!
ఒంటరిగా ఉన్న వ్యక్తిని అదును చూసి ఇద్దరు దుండగులు దొంగతనానికి పాల్పడ్డారు. ఆయన ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ కావడంతో వారి సీన్ రివర్స్ అయింది. -
Electoral Bonds: ఎన్నికల బాండ్ల నంబర్లూ చెప్పాల్సిందే.. ఎస్బీఐకి సుప్రీం డెడ్‌లైన్
Electoral Bonds: ఎన్నికల బాండ్ల నంబర్లను ఈసీకి ఇవ్వకపోవడంతో ఎస్బీఐపై సుప్రీంకోర్టు మరోసారి మండిపడింది. మార్చి 21లోగా అన్ని వివరాలు ఇవ్వాల్సిందేనని డెడ్‌లైన్ విధించింది. -
Electoral Bonds: నా విరాళాలు వారికిచ్చాను.. ఎన్నికల బాండ్లపై కిరణ్ మజుందార్ షా
Electoral Bonds: వ్యక్తిగత హోదాలో ఎన్నికల బాండ్ల ద్వారా తాను కొన్ని పార్టీలకు నామమాత్రపు విరాళాలిచ్చినట్లు బయోకాన్ ఛైర్పర్సన్ కిరణ్ మజుందార్ షా వెల్లడించారు. -
S Jaishankar: ‘స్నేహమంటే అదే కదా’: నేవీ ఆపరేషన్‌పై జై శంకర్ ఆసక్తికర రిప్లై
హైజాక్ అయిన నౌక నుంచి 17 మంది బందీలను మన నౌకాదళం విడిపించింది. ఇందుకు బల్గేరియా దేశం ధన్యవాదాలు తెలిపింది. -
Arvind Kejriwal: దిల్లీ జల్‌బోర్డు కేసులోనూ.. ఈడీ సమన్లకు కేజ్రీవాల్ డుమ్మా
Arvind Kejriwal: దిల్లీ జల్‌బోర్డుకు సంబంధించిన కేసులోనూ ఈడీ విచారణకు ముఖ్యమంత్రి కేజ్రీవాల్ డుమ్మా కొట్టారు.ఆ సమన్లు అక్రమమని ఆరోపించారు. -
Russia: మమ్మల్ని విడిపించండి ప్లీజ్: రష్యా నుంచి భారతీయుల మరో వీడియో
Indians Stuck In Russia: రష్యా సైన్యంలో చిక్కుకుపోయిన భారతీయులు తమను కాపాడాలంటూ మరోసారి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వీడియో విడుదల చేశారు. -
Rahul Gandhi: ‘ఆయన మా అమ్మకు ఫోన్ చేసి కన్నీటిపర్యంతమయ్యారు’: రాహుల్ గాంధీ వ్యాఖ్యలు
ఇటీవల కాంగ్రెస్(Congress)ను వీడిన సీనియర్ నేతలను ఉద్దేశించి.. ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఎన్డీయే కూటమిపై విమర్శలు చేశారు. -
వారికి అమెరికా పౌరసత్వం ఇస్తుందా?: హరీశ్ సాల్వే
భారత్ పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అమలు చేయడంపై ఇటీవల అమెరికా ఆందోళన వ్యక్తం చేయడాన్ని సీనియర్ న్యాయవాది, మాజీ సోలిసిటర్ జనరల్ హరీశ్ సాల్వే తప్పుపట్టారు. ప్ -
కోడ్ మీరితే కొరడా!
భారతదేశంలో ఎన్నికలు ఓ మహాసంగ్రామం! గెలుపే లక్ష్యంగా పార్టీలు ఎత్తుగడలు, వ్యూహ ప్రతివ్యూహాలు రచిస్తుంటాయి. -
బెట్టింగ్ యాప్ కుంభకోణం.. భూపేశ్ బఘేల్‌పై కేసు
మహదేవ్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్‌పై రాష్ట్ర ఆర్థికనేరాల విభాగం (ఈవోడబ్ల్యూ) కేసు నమోదు చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
KL Rahul: ఐపీఎల్ 2024 సీజన్.. కేఎల్ రాహుల్ ఫిట్‌నెస్‌పై కీలక అప్డేట్
-
Chandrababu: ముస్లింలకు మేలు చేసింది.. చేసేది తెదేపానే: చంద్రబాబు
-
Hunger Crisis: క్షామం అంచున గాజా.. 2 లక్షల మంది విపత్కర పరిస్థితుల్లో!
-
Lalu Prasad Yadav: రాజకీయాల్లోకి లాలూ మరో కుమార్తె..?
-
Nalgonda: ఎన్నికల కోడ్.. మిర్యాలగూడలో రూ.5.73 కోట్ల బంగారం పట్టివేత
-
BJP: జితేందర్‌రెడ్డి, రంజిత్‌రెడ్డి ఏ లబ్ధికి కాంగ్రెస్‌లోకి వెళ్లారు?: రఘునందన్‌రావు