Published : 01/12/2021 19:09 IST

వ్యవసాయ చట్టాల రద్దుకు రాష్ట్రపతి ఆమోదం

దిల్లీ: వ్యవసాయ చట్టాల రద్దు ప్రక్రియ పూర్తయ్యింది. మూడు చట్టాల రద్దుకు సంబంధించిన బిల్లుకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ బుధవారం ఆమోదం తెలిపారు. దీంతో వివాదానికి కారణమైన ఈ మూడు చట్టాల రద్దు ప్రక్రియ సమాప్తమైంది. పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు ప్రారంభమైన తొలి రోజే (సోమవారం) ఈ మూడు చట్టాల రద్దుకు సంబంధించిన బిల్లును కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ ప్రవేశపెట్టారు. తొలుత లోక్‌సభ, తర్వాత రాజ్యసభలో ప్రవేశపెట్టగా.. ఎలాంటి చర్చా లేకుండానే ఈ బిల్లు ఆమోదం పొందింది. వ్యవసాయ చట్టాల రద్దు కోరుతూ ఏడాదిగా దిల్లీ సరిహద్దుల్లో పంజాబ్‌, హరియాణా, యూపీ రైతులు ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. పంజాబ్‌, యూపీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కేంద్రం రద్దు నిర్ణయం తీసుకుందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని