Published : 08 Jan 2021 19:30 IST

ఆ ఆరు రాష్ట్రాల్లోనే బర్డ్‌ ఫ్లూ!

కేంద్ర ప్రభుత్వం వెల్లడి

దిల్లీ: దేశంలో బర్డ్‌ ఫ్లూ ఆందోళన పెరుగుతోన్న నేపథ్యంలో.. ఇప్పటివరకు ఆరు రాష్ట్రాల్లోనే ఈ వ్యాధి నిర్ధారణ అయినట్లు కేంద్రప్రభుత్వం వెల్లడించింది. కేరళ, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, హరియాణా, గుజరాత్‌ రాష్ట్రాల్లోనే ఇప్పటివరకు బర్డ్‌ ఫ్లూ నిర్ధారణ జరిగినట్లు పేర్కొంది. ముందస్తు ప్రణాళిక ప్రకారం, వ్యాధిని కట్టడి చేసేందుకు ఆయా రాష్ట్రాలు చర్యలు చేపట్టాలని సూచించింది.

ఇక దేశరాజధాని దిల్లీలోనూ 16 పక్షులు అనుమానాస్పద స్థితిలో మరణించినట్లు కేంద్రం వెల్లడించింది. పరీక్షల నిమిత్తం వాటి నమూనాలను ల్యాబ్‌కు పంపించినట్లు తెలిపింది. కేరళలో వ్యాధి బయటపడిన రెండు జిల్లాల్లో పక్షులను వధించే ప్రక్రియ పూర్తయిందని, ప్రస్తుతం క్రిమిసంహారక ప్రక్రియ కొనసాగుతోందని పేర్కొంది. హరియాణాలో రెండు కోళ్ల ఫాంలలో దీన్ని గుర్తించగా, గుజరాత్, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో కాకుల్లో ఎక్కువగా ఈ వ్యాధి బయటపడినట్లు తెలిపింది. ఇప్పటివరకు బర్డ్‌ ఫ్లూ (ఏవియన్‌ ఇన్‌ఫ్లూయంజా) సోకని రాష్ట్రాల్లోనూ పక్షుల అనుమానాస్పద మరణాలను గుర్తిస్తే, వెంటనే తెలియజేయాలని సూచించింది. తద్వారా సాధ్యమైనంత తక్కువ సమయంలో వ్యాధి కట్టడి చేయవచ్చని స్పష్టం చేసింది.

బర్డ్‌ఫ్లూ ప్రభావిత రాష్ట్రాలైన కేరళ, హరియాణా, హిమాచల్‌ ప్రదేశ్‌ల్లో పరిస్థితిని పర్యవేక్షించేందుకు ప్రత్యేక బృందాలను కేంద్రం పంపించింది. బర్డ్‌ ఫ్లూ వ్యాధి వ్యాప్తి నేపథ్యంలో అటు పౌల్ట్రీ యాజమానులు,  ప్రజల్లో ఆందోళనలను తొలగించేందుకు ఆయా రాష్ట్రాలు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కేంద్ర  పశుసంవర్థక మంత్రిత్వశాఖ వెల్లడించింది.

ఇదిలా ఉంటే, భారత్‌లో మాత్రం బర్డ్‌ ఫ్లూ వ్యాప్తిని తొలిసారిగా 2006లో గుర్తించారు. పక్షుల్లో ప్రాణాంతకమైన ఈ వ్యాధి జంతువులకు వ్యాపించే అవకాశం ఉన్నప్పటికీ వాటి నుంచి మానవులకు సంక్రమించిన దాఖలాలు మనదేశం‌లో లేవని కేంద్ర పశుసంవర్థక మంత్రిత్వశాఖ ఇదివరకే స్పష్టంచేసింది. అంతేకాకుండా కలుషిత పౌల్ట్రీ ఉత్పత్తుల వల్ల ఈ వైరస్‌లు మానవులకు వ్యాప్తి చెందుతాయని చెప్పడానికీ ప్రత్యక్ష ఆధారాలు కూడా లేవని పేర్కొంది. అయితే, వ్యక్తిగత పరిశుభ్రత, క్రిమిసంహారక పద్దతులు, ఆహార శుద్ధి ప్రమాణాలు పాటించడం ద్వారా ఈ వైరస్‌లను సమర్థవంతంగా నియంత్రించవచ్చని సూచించింది. అధిక ఉష్ణోగ్రతల వద్ద బర్డ్‌ ఫ్లూ (ఏవియన్‌ ఇన్‌ఫ్లూయంజా) వైరస్‌ బ్రతకదని ప్రపంచ ఆరోగ్యసంస్థ కూడా స్పష్టచేసింది. అందుకే సక్రమంగా ఉడికించిన గుడ్లు, మాంసాన్నే తీసుకోవాలని సూచిస్తోంది.

ఇవీ చదవండి..
బర్డ్‌ ఫ్లూ:  మావవులకు ప్రమాదమా..?
బర్డ్ ఫ్లూ: రాష్ట్రాలకు కేంద్రం అలర్ట్‌ 

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని