Manipur: మణిపుర్ సీఎంగా బీరెన్ సింగ్ ప్రమాణం

మణిపుర్​ ముఖ్యమంత్రిగా ఎన్​ బీరెన్​ సింగ్​ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆ రాష్ట్ర గవర్నర్​ గణేషన్​ను ఆయన చేత ప్రమాణం చేయించారు.......

Published : 21 Mar 2022 16:28 IST

ఇంఫాల్‌: మణిపుర్​ ముఖ్యమంత్రిగా ఎన్​ బీరెన్​ సింగ్​ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆ రాష్ట్ర గవర్నర్​ గణేశన్​ ఆయన చేత ప్రమాణం చేయించారు. మణిపుర్‌ సీఎంగా ఆయన రెండోసారి ప్రమాణం చేయడం విశేషం. బీరెన్‌తోపాటు మరో ఐదుగురు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేశారు. ఇంఫాల్​లో జరిగిన ఈ కార్యక్రమానికి భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, మణిపుర్‌ భాజపా శాఖ రాష్ట్ర అధ్యక్షుడు అధికారి మయుమ్‌ శారదాదేవి, త్రిపుర సీఎం బిప్లవ్‌ కుమార్‌ సహా పలువురు నేతలు హాజరయ్యారు.

బీరెన్​ సింగ్ హెయ్​గాంగ్​ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ఆయన ప్రత్యర్థి, కాంగ్రెస్​ పార్టీ అభ్యర్థి పంగిజం శరత్​ చంద్ర సింగ్​పై 17వేలకుపైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. దీంతో వరుసగా ఐదోసారి ఎమ్మెల్యే అయ్యారు బీరెన్‌సింగ్‌​. ఈ ఎన్నికల్లో భాజపా ఒంటరిగా పోరులోకి దిగి.. 32 చోట్ల గెలుపొందింది. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మేజిక్​ ఫిగర్​ను సాధించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని