Viral: చిరుత దాడి.. బర్త్‌డే కేక్‌ కాపాడింది

పుట్టిన రోజు వేడుకల కోసం ఇద్దరు అన్నదమ్ములు ఓ కేక్‌ కొన్నారు. ఇంటికి తీసుకొస్తుండగా వారిపై చిరుత దాడి చేసింది. దాని నుంచి తప్పించుకోడానికి కేక్‌ను చిరుత ముఖంపై విసిరి కొట్టారు. దీంతో అది..

Published : 01 Jul 2021 21:37 IST

భోపాల్‌: పుట్టిన రోజు వేడుకల కోసం ఇద్దరు అన్నదమ్ములు ఓ కేక్‌ కొన్నారు. ఇంటికి తీసుకొస్తుండగా వారిపై చిరుత దాడి చేసింది. దాని నుంచి తప్పించుకోడానికి కేక్‌ను చిరుత ముఖంపై విసిరి కొట్టారు. దీంతో అది ఆగిపోయింది. బతుకుజీవుడా అంటూ వారిద్దరూ అక్కడి నుంచి బయపడ్డారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది.

ఫిరోజ్‌, సబీర్‌ అన్నదమ్ములు. ఫిరోజ్‌ కుమారుడి పుట్టిన రోజు కోసం బుర్హాపూర్‌లో కేక్‌ తీసుకొని ద్విచక్రవాహనంపై స్వగ్రామానికి వస్తుండగా మార్గమధ్యలో చెరకు తోటలోంచి వచ్చిన చిరుత వారిపై దాడి చేసింది. దాదాపు 500 మీటర్లు వెంబడించింది. భయంతో వెనుక కూర్చున్న సబీర్‌ తన చేతిలో ఉన్న కేక్‌ను బలంగా చిరుత ముఖం మీదికి విసిరాడు.  దీంతో చిరుత అక్కడితో ఆగిపోయి, పక్కనున్న పొలాల్లోకి వెళ్లిపోయింది.

2014-2018 మధ్య కాలంలో దేశవ్యాప్తంగా చిరుత పులుల సంఖ్య దాదాపు 13,000 మేర పెరిగినట్లు రికార్డులు చెబుతున్నాయి.  వీటిలో అత్యధికంగా మధ్యప్రదేశ్‌లోనే పెరిగాయి. ఇవి పెద్దపులులంత భయంకరమైనవి కాదు. ఆహారం కోసం అప్పుడప్పుడూ గ్రామాల్లోకి ప్రవేశిస్తుంటాయి. కొన్నిసార్లు అటవీప్రాంత సమీపంలోని సిటీల్లోకి కూడా వచ్చేస్తుంటాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని