
Rakesh Tikait: ‘భాజపా, ఆరెస్సెస్‌లతో జాగ్రత్త.. ఎంతకైనా తెగిస్తాయి’
దిల్లీ: దేశ ప్రజలను విడగొట్టేందుకు భాజపా, ఆరెస్సెస్‌లు ఎంత దూరమైనా వెళ్తాయని రైతు నాయకుడు, భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) ప్రతినిధి రాకేశ్ టికాయిత్ ఆరోపించారు. వాటితో దేశ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ప్రజలను, వారి మధ్య ఐక్యతను విడదీసేందుకు భాజపా, ఆరెస్సెస్ ఎంతకైనా తెగిస్తాయని వ్యాఖానించారు. సాగు చట్టాల విషయంపై రైతులతో చర్చలు జరపాలని కేంద్రానికి సూచించారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమం ప్రారంభించి ఏడాది సమీపిస్తున్న నేపథ్యంలో టికాయిత్ మీడియాతో మాట్లాడారు. కేంద్రం చర్చలకు ఆహ్వానిస్తే మంచిదని.. లేదంటే నిరసనలు కొనసాగుతూనే ఉంటాయని హెచ్చరించారు.
‘ప్రభుత్వం మాతో ఎందుకు చర్చలు జరపడం లేదు? దాదాపు ఏడాది కావొస్తోంది. ఇంత సుదీర్ఘంగా ఏ నిరసనలైనా జరగడం చూశారా? ఈ ఉద్యమాన్ని ఎంత దూరం తీసుకెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది? చర్చలకు మేం సిద్ధంగా ఉన్నాం. మాతో మాట్లాడండి. ఓ నిర్ణయానికి రండి’ అని రాకేశ్ టికాయిత్ పేర్కొన్నారు. నిరసనలు కొనసాగించేందుకు మరిన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. శీతాకాలం వచ్చేసింది కాబట్టి చలిని తట్టుకునేలా దుస్తులు తెచ్చుకోవాలని రైతులను కోరుతామని పేర్కొన్నారు. హరియాణాలోని హిసార్ జిల్లాలో భాజపా ఎంపీ రామ్ చందర్ జాంగ్రా కారుపై దాడి ఘటనపైనా టికాయిత్ మాట్లాడారు. కొందరు ప్రైవేటు గూండాలు రైతుల్లో కలిసిపోయారని ఆరోపించారు. పోలీసులు పట్టించుకోకపోవడంతో ఇలాంటివారు రైతుల్లో కలిసిపోయి దాడులకు తెగబడుతున్నారని పేర్కొన్నారు.
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న రైతులపై ఎంపీ రామ్ చందర్ జాంగ్రా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పనిలేని తాగుబోతులే వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఎంపీ వ్యాఖ్యలపై రైతుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. శుక్రవారం హిసార్ జిల్లా నర్నౌంద్‌లో కొందరు జాంగ్రా కారును అడ్డగించి వాహనాన్ని ధ్వంసం చేశారు. రైతులే ఈ దాడి చేశారని.. తనపై హత్యాయత్నం జరిగిందని ఎంపీ ఆరోపించారు. జాంగ్రా వ్యాఖ్యలపై నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. మంత్రిపై చర్యలు తీసుకోవాలంటూ రైతులు నినదిస్తున్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Telangana News: కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానా!
-
Movies News
Ram: రూమర్స్‌తో విసిగిపోయిన రామ్.. ఇంట్లోవాళ్లకే సమాధానం చెప్పుకోవాల్సిన స్థితి వచ్చిందంటూ పోస్ట్
-
Business News
Stock Market: లాభాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు
-
Ap-top-news News
Botsa: అందుకే నాకు భయమేస్తోంది: బొత్స
-
Ap-top-news News
Raghurama: రఘురామను హైదరాబాద్‌లోనే విచారించండి: ఏపీ సీఐడీకి హైకోర్టు ఆదేశం
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- తెలంగాణ రుచులు... మళ్లీ మళ్లీ యాదికి రావాలె!
- IND vs ENG: కథ మారింది..!
- బీచ్‌లో కాలక్షేపం కోసం ₹5 లక్షల కోట్ల కంపెనీకి సీఈఓ రాజీనామా!
- 18 కేసుల్లో అభియోగపత్రాలున్న జగన్‌కు లేని ఇబ్బంది నాకెందుకు?
- Allu Arjun: ‘పుష్ప’తో మక్కల్ సెల్వన్ ఢీ.. లెక్కల మాస్టారి స్కెచ్ అదేనా?
- Maharashtra Crisis: సీఎం పదవికి రాజీనామా
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (30-06-2022)
- Udaipur Murder: ‘నన్ను చంపడానికి ప్లాన్.. రక్షించండి’.. హత్యకు ముందు పోలీసులకు దర్జీ ఫిర్యాదు!
- Shivani Rajasekhar: ‘మిస్ ఇండియా’ పోటీ నుంచి తప్పుకున్న శివానీ రాజశేఖర్.. కారణమిదే
- Maharashtra crisis: మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా.. గవర్నర్ ఆమోదం