Paper leaks: ఐదేళ్లలో 45 పరీక్షా పేపర్లు లీక్‌ - కేంద్రంపై మండిపడ్డ ప్రియాంక

భాజపా హయాంలో పేపర్ల లీకేజీ వ్యవహారం జాతీయ సమస్య అయిపోయిందని.. కోట్లాది మంది యువత భవిష్యత్తు నాశనం అవుతోందని ప్రియాంక గాంధీ పేర్కొన్నారు.

Published : 22 Jun 2024 00:13 IST

దిల్లీ: పేపర్‌ లీకేజీల వ్యవహారం దేశాన్ని కుదిపేస్తున్న వేళ.. కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్‌ నేత ప్రియాంకా గాంధీ విరుచుకుపడ్డారు. భాజపా హయాంలో ఇది జాతీయ సమస్య అయిపోయిందని.. కోట్లాది మంది యువత భవిష్యత్తును నాశనం చేస్తోందని దుయ్యబట్టారు. యూజీసీ-నెట్‌ రద్దు, నీట్‌ పరీక్షలో అవకతవకలను ప్రస్తావించిన ఆమె కేంద్ర తీరుపై మండిపడ్డారు.

‘‘గడిచిన ఐదేళ్లలో దేశంలో 43 నియామక పరీక్షల పేపర్లు లీక్‌ అయ్యాయి. భాజపా పాలనలో పేపర్‌ లీకేజీలు జాతీయ సమస్యగా మారాయి. కోట్లాది మంది యువత భవిష్యత్తును భాజపా నాశనం చేసింది. ప్రపంచంలో అత్యంత యువ దేశం మనది. యువత జనాభా అత్యధికం. యువతకు నైపుణ్యాలు, సమర్థులుగా చేసేందుకు బదులు ప్రభుత్వం వారిని బలహీనులుగా మారుస్తోంది’’అని ప్రియాంక గాంధీ విమర్శించారు.

‘‘కోట్లాదిమంది ప్రతిభావంతమైన విద్యార్థులు వివిధ పరీక్షల కోసం రాత్రి, పగలు కష్టపడుతుండగా.. వారి తల్లిదండ్రులు అన్నీ త్యాగం చేసి వారికోసమే బతుకుతున్నారు. నియామకాల కోసం విద్యార్థులు ఏళ్లపాటు వేచిచూడాల్సి వస్తోంది. చివరకు పరీక్షల్లో అవకతవకలతో వారి శ్రమంతా వృథా అవుతోంది’’ అని ప్రియాంక అన్నారు. భాజపా అవినీతి దేశాన్ని బలహీనపరుస్తోందని దుయ్యబట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు