BJP: అమెరికన్ల దృష్టిలో ప్రపంచంలోనే అతి ముఖ్యమైన పార్టీ భాజపా: వాల్‌స్ట్రీట్ కథనం
భారత్‌లోని అధికార భాజపాపై అమెరికా పత్రిక వాల్‌స్ట్రీట్ జర్నల్ ప్రత్యేక కథనం వెలువరించింది. వాషింగ్టన్ ప్రయోజనాల దృష్ట్యా భాజపాను విస్మరించలేమని పేర్కొంది.
ఇంటర్నెట్‌డెస్క్: అమెరిక(USA)న్ల జాతి ప్రయోజనాల కోణంలో నుంచి చూస్తే అత్యంత ముఖ్యమైన విదేశీ రాజకీయ పార్టీ భాజపా(BJP) అని అక్కడి ప్రముఖ పత్రిక వాల్‌స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. ఈ మేరకు ఆ పత్రిక నేడు కథనం ప్రచురించింది. భారత్ (India) అత్యంత వేగంగా ఆర్థిక శక్తిగా ఎదగడమే కాకుండా.. ఇండో-పసిఫిక్ వ్యూహ రచనలో జపాన్‌తో సమానంగా అమెరికాతో కలిసి పనిచేస్తోందని ఆ కథనంలో వెల్లడించింది. పెరుగుతున్న చైనా శక్తిని సమతుల్యం చేయడానికి అమెరికా ప్రయత్నాలకు ఎవరి సాయం లేకుండానే ఆ పార్టీ నుంచి కార్యాచరణ లభిస్తుందని వెల్లడించింది. భారత్ బయట భాజపాను అర్థం చేసుకొన్న వారు చాలా తక్కువ మంది ఉన్నారని తెలిపింది. ఎందుకంటే.. విదేశాల్లో ఎక్కువ మందికి అవగాహన లేని రాజకీయ, సాంస్కృతిక చరిత్ర నుంచి ఆ పార్టీ ఎదిగిందని వెల్లడించింది.
ముస్లిం బ్రదర్‌హుడ్ మాదిరిగా భాజపా కూడా చాలా పశ్చిమ దేశాల ఉదారవాద ఆలోచనలను తిరస్కరిస్తుందని వాల్‌స్ట్రీట్ పేర్కొంది. చైనా కమ్యూనిస్టు పార్టీ వలే 100 కోట్లకుపైగా జనాభాతో భారత్ ప్రపంచ శక్తిగా మారాలని భాజపా భావిస్తోందని విశ్లేషించింది. ఇక ఇజ్రాయెల్‌లోని లికుడ్ పార్టీలా మార్కెట్ అనుకూల విధానాలను అనుసరిస్తూనే.. మరోవైపు ప్రజాకర్షక పనులు, సంప్రాదాయ విలువలకు ప్రాధాన్యమిస్తుందని తెలిపింది. కాస్మోపాలిటన్, పశ్చిమ దేశాల సంస్కృతి నుంచి దూరంపెట్టినట్లు భావించేవారి కోపాన్ని కూడా అనుకూలంగా మలుచుకుంటోందని పేర్కొంది.
ఇటీవల కాలంలో క్రిస్టియన్ మెజార్టీ ఉన్న ఈశాన్య భారత్‌లో భాజపా విజయాలను వాల్‌స్ట్రీట్ కథనంలో ప్రస్తావించారు. అంతేకాదు.. దాదాపు 20 కోట్ల జనాభా ఉన్న ఉత్తరప్రదేశ్‌లో షియా ముస్లింల నుంచి బలమైన మద్దతు ఆ పార్టీకి లభిస్తోందని చెప్పింది. కుల వ్యవస్థలో వివక్షపై పోరాటానికి ఆర్‌ఎస్ఎస్ బలంగా పనిచేస్తోందని అమెరికా పత్రిక తెలిపింది. భాజపా, ఆర్‌ఎస్‌ఎస్‌తో సంబంధాలను అమెరికన్లు కాదనలేని పరిస్థితి నెలకొందని చెప్పింది. చైనా వేగంగా ఎదుగుతున్న సమయంలో ఆర్థిక, రాజకీయ భాగస్వామ్య అవసరం అమెరికాకు చాలా ఉందని పేర్కొంది. భారత్‌తో సుస్థిర సంబంధాల విషయంలో హిందూ జాతీయ భావాలను, ఉద్యమాన్ని అర్థం చేసుకోవడం వ్యాపారవేత్తలు, దౌత్యవేత్తలు, రాజకీయ నాయకులకు అవసరమని వాల్‌స్ట్రీట్ వెల్లడించింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
Tirumala: శ్రీవారి ఆలయ సమీపంలో వెళ్లిన విమానం
-
Sports News
చిరునవ్వుతో టాటా.. పీఎస్జీని వీడిన మెస్సి
-
India News
పామును కొరికి చంపిన బాలుడు
-
India News
28 వేల మంది జమ్మూకశ్మీర్ ప్రభుత్వోద్యోగులపై ఐటీ శాఖ నిఘా
-
India News
అనాథకు.. తండ్రిని చూపిన అన్నదానం
-
Ts-top-news News
ప్రొటోకాల్ వివాదం.. శిలాఫలకాల తొలగింపు