రామ మందిరానికి గంభీర్‌ భారీ విరాళం 

అయోధ్య రామమందిరం నిర్మాణానికి మాజీ క్రికెటర్‌, భాజపా ఎంపీ గౌతం గంభీర్‌ భారీ విరాళం ఇచ్చారు. తన వంతుగా ...

Updated : 21 Jan 2021 20:03 IST

దిల్లీ: అయోధ్య రామమందిరం నిర్మాణానికి మాజీ క్రికెటర్‌, భాజపా ఎంపీ గౌతం గంభీర్‌ భారీ విరాళం ఇచ్చారు. తన వంతుగా రూ.కోటి విరాళాన్ని ప్రకటించారు. దేశ ప్రజల చిరకాల స్వప్నమైన ఈ అద్భుత కట్టడం నిర్మాణానికి తాను, తన కుటుంబం తరఫున ఈ విరాళం అందజేసినట్టు ఆయన వెల్లడించారు. యూపీలోని అయోధ్య నగరంలో అద్భుతమైన రామమందిర నిర్మాణం భారతీయులందరి కల అన్నారు. దీనిపై సుదీర్ఘకాలంగా ఉన్న సమస్యకు తెరపడటంతో ఐక్యత, ప్రశాంతతకు మార్గం సుగమైందని తెలిపారు. ఇందులో తమ వంతుగా చిన్న సాయం అందజేసినట్టు ఆయన పేర్కొన్నారు. 

కూపన్లతో విరాళాలు: దిల్లీ భాజపా నిర్ణయం
మరోవైపు, అయోధ్యలో రామమందిరం నిర్మాణం కోసం నగర ప్రజల నుంచి కూపన్ల రూపంలో విరాళాలు సేకరించేందుకు దిల్లీ భాజపా క్యాంపెయిన్‌ ప్రారంభించింది. రూ.10, రూ.100, రూ.1000ల చొప్పున కూపన్లతో సాధ్యమైనంతగా విరాళాలు సేకరించాలని నిర్ణయించినట్టు దిల్లీ భాజపా ప్రధాన కార్యదర్శి, ఈ క్యాంపెయిన్‌ కన్వీనర్ కుల్జీత్ చాచల్‌ తెలిపారు. రూ.1000కి పైగా ఉంటే చెక్కుల రూపంలో ఇవ్వొచ్చని తెలిపారు. విరాళాల సేకరణ కోసం ఫిబ్రవరి 1నుంచి ఇంటింటి ప్రచారం కార్యక్రమం చేపట్టనున్నట్టు చాచల్‌ తెలిపారు.

ఇదీ చదవండి..

ఇంకా నయం.. వారినీ తీసేస్తారనుకున్నా: గంభీర్‌ 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని