Published : 12 Dec 2021 23:30 IST

MSP: కనీస మద్దతు ధర కోసం వరుణ్‌ గాంధీ ప్రైవేటు బిల్లు!

దిల్లీ: గత కొంతకాలంగా రైతులకు మద్దతుగా నిలుస్తున్న భాజపా ఎంపీ వరుణ్‌ గాంధీ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. పంటలకు కనీస మద్దతు ధరను చట్టబద్ధ హామీగా మార్చేందుకుగానూ పార్లమెంటుకు ప్రైవేటు బిల్లు తీసుకురావడానికి సిద్ధమయ్యారు. ఈ మేరకు రూపొందించిన బిల్లును పార్లమెంటుకు సమర్పించారు. ‘ది ఫార్మర్స్‌ రైట్‌ టు గ్యారంటీడ్‌ మినిమం సపోర్ట్‌ ప్రైస్‌ రియలైజేషన్‌ ఆఫ్‌ అగ్రి ప్రొడ్యూస్‌ బిల్‌, 2021’గా పేర్కొంటున్న దీన్ని ఇంకా లోక్‌సభలో ప్రవేశపెట్టాల్సి ఉంది.

కనీస మద్దతు ధర(ఎంఎస్‌పీ)ను చట్టబద్ధం చేయాలని వరుణ్‌ గాంధీ బిల్లులో పేర్కొన్నారు. లేదంటే పంట విక్రయ ధరకు, ఎంఎస్‌పీకి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ప్రభుత్వమే పరిహారంగా ఇవ్వాలని తెలిపారు. అలాగే డబ్బును రెండు రోజుల్లో నేరుగా రైతుల ఖాతాలో జమ చేయాలన్నారు. కొత్త సాగు చట్టాలను రద్దు చేస్తూ ప్రభుత్వం తెచ్చిన బిల్లుకు పార్లమెంటు ఆమోదం తెలిపిన దాదాపు వారం తర్వాత వరుణ్‌ గాంధీ ఈ బిల్లును తెరపైకి తీసుకురావడం గమనార్హం. మరోవైపు తమ డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం ఓ కమిటీని నియమిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు సైతం తమ నిరసనలను ముగించి స్వస్థలాలకు చేరుకున్నారు.

పార్టీ నిర్ణయాలకు అతీతంగా గతకొంత కాలంగా వరుణ్‌ గాంధీ రైతులకు మద్దతు ప్రకటించారు. నిరసన తెలుపుతున్న అన్నదాతలతో చర్చలు జరపాలని సూచిస్తూ వచ్చారు. అలాగే నలుగురు రైతులు మరణించిన లఖీంపూర్‌ ఖేరీ ఘటనలో కేంద్ర మంత్రి అజయ్‌ మిశ్రాపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

పార్టీతో సంబంధం లేకుండా సొంతంగా ప్రైవేటు బిల్లును ప్రవేశ పెట్టే హక్కు ఎంపీలకు ఉంటుంది. 1952 నుంచి ఇప్పటి వరకు దాదాపు 300 ప్రైవేటు బిల్లులను ప్రవేశపెట్టారు. వీటిలో 96 శాతం అసలు చర్చకు నోచుకోలేదు. కేవలం 14 మాత్రమే ఆమోదం పొందాయి.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని