JP Nadda: జేపీ నడ్డా పదవీకాలం పొడిగింపు

భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పదవీ కాలాన్ని పొడిగిస్తూ భాజపా కార్యవర్గ సమావేశాల్లో నిర్ణయం తీసుకున్నారు.

Updated : 18 Feb 2024 17:55 IST

దిల్లీ: భారతీయ జనతా పార్టీ (BJP) అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda) పదవీకాలాన్ని పొడిగించారు. ఈ ఏడాది జూన్‌ వరకు ఆయనే పార్టీ అధ్యక్షుడిగా వ్యవహరించనున్నారు. ఈ మేరకు భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాల్లో నిర్ణయం తీసుకున్నారు.

నడ్డా నాయకత్వంలో పలు రాష్ట్రాల్లో పార్టీ విజయం సాధించిందని, ఈ విజయోత్సాహాన్ని కొనసాగిస్తూ ఆయన పదవీకాలాన్ని పొడిగించేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు ఇటీవల కేంద్రమంత్రి హోంమంత్రి అమిత్‌ షా తెలిపారు. తాజాగా పార్టీ జాతీయ కార్యవర్గం ఈ నిర్ణయాన్ని ఆదివారం ఆమోదించింది. పార్టీ పార్లమెంటరీ బోర్డు ఆమోదంతో వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే అధికారం నడ్డాకు అప్పగించినట్లు భాజపా తెలిపింది. 2019 వరకు పార్టీ చీఫ్‌గా అమిత్‌ షా వ్యవహరించారు. ఆ తర్వాత నడ్డా పార్టీ అధ్యక్ష బాధ్యతను స్వీకరించారు.

కాంగ్రెస్‌కు ఓటేస్తే పూడ్చలేని నష్టం.. మూడోసారి గెలుపుపై అనుమానం అక్కర్లేదు: ప్రధాని మోదీ

దిల్లీలో జరుగుతున్న పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు భాజపా అగ్రనేతలతో పాటు వేల మంది కార్యకర్తలు హాజరయ్యారు. త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో మరోసారి అధికారం చేజిక్కించుకునేందుకు భాజపా తీవ్రంగా యత్నిస్తోంది. 2019 ఎన్నికల్లో పార్టీ కోల్పోయిన 161 స్థానాలపై దృష్టిని కేంద్రీకరిస్తోంది. వీటిలో 67 స్థానాల్లో కచ్చితంగా విజయం సాధించాలని ప్రధాని మోదీ లక్ష్యంగా విధించినట్లు కార్యకర్తలకు తెలిపారు. ఈ సారి భాజపా 370 సీట్లు.. ఎన్డీయే 400 సీట్లకు పైగా సొంతం చేసుకుంటుందని జేపీ నడ్డా ధీమా వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని