Rajya Sabha: యూసీసీ కోరుతూ భాజపా, గవర్నర్ అధికారాలపై సీపీఎం ప్రైవేటు బిల్లులు
దేశంలో ఉమ్మడి పౌరస్మృతి అమలు చేయాలని కోరుతూ రాజ్యసభలో భాజపా ఎంపీ ప్రైవేటు బిల్లును ప్రవేశపెట్టగా, గవర్నర్ పాత్ర, అధికారలపై సవరణ కోరుతూ కేరళకు చెందిన సీపీఎం ఎంపీ ప్రైవేటు బిల్లును ప్రవేశపెట్టారు.
దిల్లీ: ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) కోరుతూ శుక్రవారం రాజ్యసభలో భాజపా ఎంపీ ప్రైవేటు బిల్లును ప్రవేశపెట్టారు. మొదటి నుంచి ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషక్షాలు, ఈ దఫా కూడా అడ్డుకున్నాయి. రాజస్థాన్‌కు చెందిన భాజపా ఎంపీ కిరోడి లాల్ మీనా దేశంలో ఉమ్మడి పౌరస్మృతి అమలు చేయాలని కోరుతూ ప్రైవేటు బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టారు. అయితే, ఈ బిల్లును కాంగ్రెస్ సహా సీపీఐ, సీపీఎం, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే, సమాజ్‌వాద్ పార్టీలు వ్యతిరేకించాయి. ఇది దేశంలో సామాజిక నిర్మాణాన్ని, భిన్నత్వంలో ఏకత్వాన్ని నాశనం చేస్తుందని ఆరోపించాయి. ఈ బిల్లుపై రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ వాయిస్ ఓటింగ్ నిర్వహించగా.. 63 అనుకూల, 23 వ్యతిరేక ఓట్లు వచ్చాయి. యూసీసీని ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తుండగా, కేంద్రం మాత్రం యూసీసీని అమలు చేసి తీరుతామని చెబుతోంది.
ఈ బిల్లుతోపాటు గవర్నర్ పాత్ర, అధికారాలకు సంబంధించి రాజ్యాంగంలో సవరణలు కోరుతూ కేరళకు చెందిన సీపీఎం ఎంపీ వి. శివదాసన్ ప్రైవేటు బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ఇటీవల కేరళ రాష్ట్ర సర్కార్‌కు, ఆ రాష్ట్ర గవర్నర్‌కు మధ్య జరిగిన ఘర్షణ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఆయన ఈ బిల్లును ప్రవేశపెట్టారు. గవర్నర్ వ్యవస్థ రాజులకాలంనాటి నుంచి ఉందని శివదాసన్ అన్నారు. అయితే, కాలక్రమంలో అదో నామినేటెడ్ పోస్టుగా మారిపోయిందని, ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్షాలపై దాన్నో అస్త్రంగా ప్రయోగిస్తుందని ఆరోపించారు. గవర్నర్ పదవి నామినేటెడ్ పోస్ట్ అయితే, రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి మూడు పేర్లు సేకరించాలని కేంద్రానికి సూచించారు. ఒకవేళ గవర్నర్‌ను ఎన్నికల ప్రక్రియ ద్వారా ఎంపిక చేయాలంటే ఎలక్టోరల్ కాలేజ్ ద్వారా ఎన్నికలు నిర్వహించాలని కేంద్రాన్ని ఎంపీ డిమాండ్ చేశారు. గవర్నర్లు బహిరంగంగా రాష్ట్ర ప్రభుత్వ విధానాలను విమర్శించడాన్ని కూడా ఈ సందర్భంగా ఆయన తప్పుబట్టారు.
కేరళలో పినరయి విజయన్ సర్కార్ నియమించిన తొమ్మది మంది వీసీలను రాజీనామా చేయాలని ఆ రాష్ట్ర గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ ఆదేశించారు. వీసీలను రాజీనామా కోరే అధికారం గవర్నర్‌కు లేదని సీఎం విజయన్ మండిపడ్డారు. దాంతోపాటు గవర్నర్‌ను కేరళలోని విశ్వవిద్యాలయాల ఛాన్సలర్ పదవి నుంచి తప్పిస్తూ కేరళ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అందుకు సంబంధించిన ఆర్డినెన్స్‌ను ఆమోదించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం రాజ్‌భవన్‌ను కోరింది. దీనిపై గవర్నర్ స్పందించారు. ఆర్డినెన్స్‌పై తాను నిర్ణయం తీసుకోబోనని, దస్త్రాన్ని రాష్ట్రపతి కార్యాలయానికి పంపిస్తానని, రాష్ట్రపతి నిర్ణయం తీసుకుంటారని తెలిపారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Andhra News: ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య.. ఘటనాస్థలానికి వెళ్లిన వార్డెన్ హఠాన్మరణం
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Sports News
PV Sindhu: ఆ స్వర్ణం కోసం అయిదేళ్లు ఎదురుచూశా: పీవీ సింధు
-
Politics News
YSRCP: ప్రతి ఇంటికీ జగన్ స్టిక్కర్!
-
Crime News
సహజీవనం చేస్తూ హతమార్చాడు: తల్లీకుమార్తెలను గునపంతో కొట్టి చంపిన ప్రియుడు
-
Sports News
Sunil Gavaskar: బ్రిస్బేన్ పిచ్ గురించి మాట్లాడరేం?