Published : 19 Mar 2021 23:18 IST

తీరత్‌పై సీరియస్‌.. వివరణ కోరిన భాజపా

దిల్లీ: మహిళల వస్త్రధారణపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి తీరత్‌సింగ్‌ రావత్‌పై భాజపా అధిష్ఠానం సీరియస్‌గా స్పందించింది. మహిళలపై చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాలని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. తీరత్‌ను దిల్లీకి పిలిచారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై మహిళలు, విపక్షాల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో నడ్డా ఈ చర్యలకు ఉపక్రమించారు.

కొంతకాలం క్రితం విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో తన పక్కన కూర్చున్న ఓ మహిళ చిరుగుల(రిప్డ్‌) జీన్స్‌ ధరించిందని, ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారని దేహ్రాదూన్‌లో నిర్వహించిన ఓ వర్క్‌షాప్‌లో తీరత్‌ పేర్కొన్నారు. ఇలాంటి దుస్తులు ధరించి సభ్యసమాజానికి ఎలాంటి సందేశమిస్తారని వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలపై రాజకీయ నాయకులు, ప్రముఖులు విమర్శలు గుప్పించారు. సోషల్‌ మీడియాలో ‘రిప్డ్‌ జీన్స్‌’ హ్యాష్‌ ట్యాగ్‌తో చురకలంటిస్తున్నారు. కొందరు మహిళలు చిరుగుల జీన్స్‌ ధరించిన పోస్టులు కూడా పెడుతూ నిరసన వ్యక్తం చేస్తున్నారు.


Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్