కేజ్రీవాల్‌ రాజీనామాకు భాజపా డిమాండ్‌.. ఆప్‌ కార్యాలయం ముందు ఆందోళన

మద్యం కుంభకోణంలో కేజ్రీవాల్ పేరు బయటపడడంతో ఆప్‌ కార్యాలయం ముందు భాజపా ఆందోళన నిర్వహించింది. కేజ్రీవాల్‌ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేసింది.

Published : 04 Feb 2023 15:37 IST

దిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిల్లీ మద్యం కుంభకోణం (Delhi excise scam)లో కేజ్రీవాల్‌ పేరు బయటపడడంతో భారతీయ జనతా పార్టీ (BJP) ఆప్‌ సర్కారుపై (AAP) విమర్శల దాడి పెంచింది. దిల్లీకి చెందిన ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు శనివారం ఆమ్‌ ఆద్మీ పార్టీ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ క్రమంలో ఆ పార్టీ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. దిల్లీ మద్యం కుంభకోణంలో ఇటీవల ఈడీ దాఖలు చేసిన అనుబంధ ఛార్జీషీట్‌లో కేజ్రీవాల్‌ పేరు బయటపడిన సంగతి తెలిసిందే.

లిక్కర్‌ స్కామ్‌లో కేజ్రీవాల్‌ పేరు బయటకొచ్చిన నేపథ్యంలో ఆమ్‌ ఆద్మీ పార్టీ సర్కారు గద్దె దిగాలని ఆ పార్టీ దిల్లీ యూనిట్‌ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవ డిమాండ్‌ చేశారు. కేజ్రీవాల్‌ ప్రభుత్వం అవినీతితో దిల్లీని చెదపురుగుల్లా తొలి చేస్తోందని విమర్శించారు. ఏమాత్రం నైతికత ఉన్నా వెంటనే కేజ్రీవాల్‌ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. లిక్కర్‌ స్కామ్‌లో కేజ్రీవాలే సూత్రధారి అని మొదటి నుంచీ చెప్తూ వస్తోందని దిల్లీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత రామ్‌వీర్‌ సింగ్‌ బిదురి అన్నారు. ఈడీ ఛార్జిషీట్‌లో ద్వారా అది నిజం అని తేలిందన్నారు.

మద్యం కుంభకోణంలో వచ్చిన రూ.100 కోట్లలో కొంత మొత్తాన్ని ఆప్‌ గత ఏడాది గోవాలో ఎన్నికల ప్రచారానికి వినియోగించినట్లు తాము గుర్తించామని ఈడీ తన ఛార్జిషీట్‌లో తెలిపింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు