Nushrat Jahan: సందేశ్‌ఖాలీలో ఉద్రిక్తత.. టీఎంసీ ఎంపీ ఫొటోషూట్‌పై భాజపా విమర్శలు

పశ్చిమ బెంగాల్‌లోని సందేశ్‌ఖాలీలో బాధిత మహిళలు నిరసలు వ్యక్తంచేస్తున్న తరుణంలో టీఎంసీ ఎంపీ నుస్రత్‌జహాన్‌ భర్తతో ఫొటోషూట్‌ జరుపుకోవడాన్ని భాజపా తీవ్రంగా తప్పుబట్టింది.

Updated : 15 Feb 2024 18:37 IST

కోల్‌కతా: మహిళలపై లైంగిక దాడుల ఆరోపణలతో పశ్చిమబెంగాల్‌లోని సందేశ్‌ఖాలీలో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో తృణమూల్‌ కాంగ్రెస్‌ (TMC)ఎంపీ నుస్రత్‌ జహాన్‌ (Nushrat Jahan) తన భర్తతో కలిసి ప్రేమికుల రోజును సెలబ్రేట్‌ చేసుకోవడాన్ని భాజపా తీవ్రంగా తప్పుబట్టింది. దీనికి సంబంధించిన వీడియోను ‘ఎక్స్‌’ (ట్విటర్‌)లో షేర్‌ చేసి ఆమెపై విమర్శలు గుప్పించింది.

టీఎంసీ ఎంపీ, నటి నుస్రత్‌ జహాన్‌ తన భర్త యశ్‌ దాస్‌గుప్తాతో కలిసి ప్రేమికుల రోజును పురస్కరించుకుని కొన్ని ఫొటోలు దిగారు. ‘‘సందేశ్‌ఖాలీలో మహిళలు తమ గౌరవం కోసం నిరసనలు చేస్తున్నారు. మరోవైపు అధికార పార్టీ ఎంపీ ప్రేమికుల దినోత్సవాన్ని వేడుకగా చేసుకున్నారు’’ అని భాజపా విమర్శించింది.

‘నోట్ల కంటే ఓట్లకే శక్తి ఎక్కువని రుజువైంది’: సుప్రీం తీర్పుపై కాంగ్రెస్‌

తృణమూల్‌ కాంగ్రెస్‌ నేత షాజహాన్‌ షేక్‌, అతడి అనుచరులు తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ సందేశ్‌ఖాలీలో బాధిత మహిళలు ఆందోళనలు చేస్తున్నారు. వీరికి భాజపా నేతలు మద్దతు తెలిపారు. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో రాష్ట్రంలో ‘144 సెక్షన్‌’ అమలవుతోంది. ఈ కేసును రాష్ట్ర హైకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని