Black Fungus: అమెరికా నుంచి అందిన 2 లక్షల ఇంజక్షన్లు

దేశంలో మ్యూకోర్‌మైకోసిస్‌ (బ్లాక్‌ ఫంగస్‌) కేసులు తీవ్రతరం అవుతున్న వేళ 2 లక్షల ఆంఫోటెరిసిన్‌-బి ఇంజక్షన్లను అమెరికా నుంచి భారత్‌కు చేరుకున్నాయి. ఈ విషయాన్ని అమెరికాలోని....

Published : 30 May 2021 19:57 IST

దిల్లీ: దేశంలో మ్యూకోర్‌మైకోసిస్‌ (బ్లాక్‌ ఫంగస్‌) కేసులు తీవ్రతరం అవుతున్న వేళ 2 లక్షల ఆంఫోటెరిసిన్‌-బి ఇంజక్షన్లను అమెరికా నుంచి భారత్‌కు చేరుకున్నాయి. ఈ విషయాన్ని అమెరికాలోని భారత రాయబారి తరన్‌జిత్‌ సింగ్‌ సంధు ట్విటర్‌ వేదికగా వెల్లడించారు. మ్యూకోర్‌మైకోసిస్ వ్యాధితో బాధపడుతున్న వారికి ఆంఫోటెరిసిన్‌-బి ఔషధాన్ని వైద్యులు అందిస్తున్నారు. అమెరికా నుంచి తాజాగా దిగుమతి చేసుకున్న ఈ ఔషధాలను బ్లాక్‌ ఫంగస్‌ బాధితులున్న ఆసుపత్రులకు అధికారులు చేర్చనున్నారు. 

కొవిడ్‌ నుంచి కోలుకున్నవారిపై బ్లాక్‌ ఫంగస్‌ విరుచుకుపడుతోంది. ముఖ్యంగా స్టెరాయిడ్లు ఎక్కువ వాడేవారితోపాటు, మధుమేహం ఉన్నవారు అధికంగా ఈ వ్యాధి బారిన పడుతున్నట్లు వైద్యులు పేర్కొంటున్నారు. అయితే  మధుమేహాన్ని అదుపులో పెట్టుకోవడం, కరోనా నుంచి కోలుకున్న తర్వాత కూడా పకడ్బందీగా మాస్క్‌ ధరించడం ద్వారా దాదాపు బ్లాక్‌ఫంగస్‌ బారిన పడకుండా కాపాడుకోవచ్చునని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. కరోనా నుంచి కోలుకున్న తర్వాత 45 రోజులు దాటితే బ్లాక్‌ఫంగస్‌ బారిన పడే ప్రమాదం చాలా తక్కువని తెలుపుతున్నారు. జూన్‌ నెలాఖరుకు బ్లాక్‌ ఫంగస్‌ కేసులు పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని