Published : 12 Nov 2021 19:32 IST

Afghanistan: అఫ్గాన్‌లో మరో బాంబు దాడి.. ముగ్గురి మృతి!

కాబుల్‌: బాంబు పేలుళ్లతో అఫ్గాన్‌ మరోసారి దద్దరిల్లింది! ఇక్కడి నంగర్‌హార్‌ ప్రావిన్స్‌ స్పిన్‌ఘర్‌ ప్రాంతంలోని ఓ మసీదులో జరిగిన పేలుడులో ముగ్గురు మృతి చెందగా, 15 మందికి పైగా గాయపడినట్లు సమాచారం. మసీదు ఇమామ్‌కూ గాయాలైనట్లు స్థానికులు వెల్లడించారు. శుక్రవారం ప్రార్థనల సమయంలో ఈ పేలుడు సంభవించింది. ఈ విషయాన్ని తాలిబన్‌ అధికారులు సైతం ధ్రువీకరించారు. మసీదు లోపల పేలుడు పదార్థాలు అమర్చినట్లు అనుమానిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని స్థానిక వైద్యాధికారులు తెలిపారు. మరోవైపు ఇంతవరకు ఏ ఉగ్రవాద సంస్థ ఈ ఘటనకు బాధ్యత వహించలేదు.

ఐఎస్‌ ప్రాబల్య ప్రాంతమిది..

తాలిబన్లు అధికారంలోకి వచ్చాక అఫ్గాన్‌లో ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాదులు పెట్రేగిపోతున్నట్లు అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తున్న విషయం తెలిసిందే. షియాలను లక్ష్యంగా చేసుకుని వారు గతంలోనూ అనేక సార్లు దాడులకు తెగబడ్డారు. పైగా నంగర్‌హార్‌ ప్రావిన్సులో వీరి ప్రాబల్యం ఎక్కువ. ఇటీవల నవంబరు 2న సైతం కాబుల్‌ నగరంలోని మిలిటరీ ఆస్పత్రి వద్ద జరిగిన బాంబు పేలుళ్లలో దాదాపు 19 మంది మృత్యువాతపడగా మరో 40 మందికి తీవ్ర గాయాలయ్యాయి.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని