ముంబయి ప్రజలరా.. ఆ చెట్లను దత్తత తీసుకోండి!

ఇటీవల తౌక్టే తుపాను ధాటికి మహారాష్ట్ర తీర ప్రాంతం, ముంబయి అతలాకుతలమైన విషయం తెలిసిందే. పెద్ద ఎత్తున అలాలు మహానగరాన్ని ముంచెత్తాయి. ఈదురు గాలులకు చెట్లు నేలకొరిగాయి. దీంతో బృహత్‌ ముంబయి కార్పొరేషన్‌ ముంబయి నగరాన్ని సాధారణ స్థితికి తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. బీఎంసీ సిబ్బంది విద్యుత్‌ను

Published : 31 May 2021 00:01 IST

ముంబయి: ఇటీవల తౌక్టే తుపాను ధాటికి మహారాష్ట్ర తీర ప్రాంతం, ముంబయి అతలాకుతలమైన విషయం తెలిసిందే. పెద్ద ఎత్తున అలలు మహానగరాన్ని ముంచెత్తాయి. ఈదురు గాలులకు చెట్లు నేలకొరిగాయి. దీంతో బృహత్‌ ముంబయి కార్పొరేషన్‌(బీఎంసీ) ముంబయి నగరాన్ని సాధారణ స్థితికి తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. బీఎంసీ సిబ్బంది విద్యుత్‌ను పునరుద్ధరించి.. దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేస్తున్నారు. మరోవైపు కుప్పకూలిన చెట్ల స్థానంలో కొత్త మొక్కలను నాటేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే బీఎంసీ వినూత్న కార్యక్రమం చేపట్టింది. 

‘అడాప్ట్‌ ఏ ట్రీ పిట్‌’ పేరుతో ప్రారంభించిన ఈ కార్యక్రమంలో భాగంగా పాక్షికంగా నేలకొరిగిన చెట్లను పునరుద్ధరించి గానీ, లేదా పూర్తిగా దెబ్బతినడంతో తొలగించిన చెట్ల స్థానంలో కొత్త మొక్క నాటి గానీ.. వాటిని దత్తత తీసుకొని సంరక్షించాలని, నగరంలో పచ్చదనాన్ని పెంపొందించాలని ముంబయి ప్రజలను బీఎంసీ కోరుతోంది. మేక్‌ ఎర్త్‌ గ్రీన్‌ ఎగైన్‌ (మెగా) ఫౌండేషన్‌తో కలిసి ముంబయిలోని కె-వెస్ట్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ విశ్వాస్‌ మోటె ఈ కార్యక్రమాన్ని ఇటీవల ప్రారంభించారు. ప్రముఖ నటి, రాజకీయ నాయకురాలు హేమమాలిని సహా పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమం ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు